Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరెంటు బిల్లు అడిగితే లైన్‌మన్‌పై దాడి

వెలిగండ్ల, నవంబరు 26 : విద్యుత్‌ వినియోగదారులు బిల్లు కట్టాలని అడిగినందుకు లైన్‌మన్‌పై దాడి చేసిన ఘటనలో శుక్రవారం ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు... మండలంలోని బొంతగుంట్ల గ్రామ ఎస్సీ కాలనీలో కంచర్ల యోహాన్‌ కొన్ని నెలల నుంచి విద్యుత్‌ బిల్లులు చెల్లించలేదు. ఈ విషయంపై లైన్‌మన్‌వినియోగదారుడు యోహాన్‌ను అడగ్గా, బకాయి కట్టబోనని తెగేసి  చెప్పాడు. విద్యుత్‌ ఏఈ ఆదేశాల మేరకు ఇంటికి విద్యుత్‌ సరఫరాను తొలగించారు. దీనికి ఆగ్రహించిన కంచర్ల యోహాను, కుటుంబ సభ్యులు లైన్‌మన్‌ శివారెడ్డిపై దాడి చేశారు. పక్కనే ఉన్న ఏఈ అడ్డు తీసే క్రమంలో ఆయనపై కూడా దురుసుగా ప్రవర్తించారు. దాడిలో గాయపడిన శివారెడ్డిని కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లైన్‌మన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement