సాయంత్రం 5 వరకు విద్యుత్‌ వసూలు కేంద్రాలు

ABN , First Publish Date - 2021-05-07T04:13:42+05:30 IST

జిల్లాలో విద్యుత్‌ బిల్లుల వసూలు కేంద్రాలు ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు పనిచేస్తాయని ఇన్‌చార్జి ఎస్‌ఈ, సీనియర్‌ అకౌంట్‌ అధికారి రమణదేవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

సాయంత్రం 5 వరకు విద్యుత్‌ వసూలు కేంద్రాలు

నెల్లూరు (జడ్పీ), మే 6 : జిల్లాలో విద్యుత్‌ బిల్లుల వసూలు కేంద్రాలు ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు పనిచేస్తాయని ఇన్‌చార్జి ఎస్‌ఈ, సీనియర్‌  అకౌంట్‌  అధికారి రమణదేవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కర్ఫ్యూ దృష్ట్యా విద్యుత్‌ బిల్లుల వసూళ్ల కేంద్రాల సమయంలో మార్పులు చేశామని తెలిపారు. జిల్లాలోని 17 రెవెన్యూ కార్యాలయాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు బిల్లులు చెల్లించవచ్చునని సూచించారు. రెవెన్యూ క్యాషియర్లు గ్రామాలకు వెళ్లి బిల్లులు కట్టించుకునే కేంద్రాలు, పట్టణాల్లోని ఏ కౌంటర్‌లు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12వరకు పనిచేస్తాయని తెలిపారు. ఈనెల 18 వరకు ఈ వేళలు వర్తిసాయని తెలిపారు. కరోనా దృష్ట్యా వినియోగదారులు డిజిటల్‌ చెల్లింపులకు అలవాటు పడాలని ఆమె కోరారు.

Updated Date - 2021-05-07T04:13:42+05:30 IST