కట్టు దిట్టంగా కర్ఫ్యూ అమలు

ABN , First Publish Date - 2021-05-09T04:48:30+05:30 IST

నియోజకవర్గంలో పాక్షిక లాక్‌డౌన్‌ను నాలుగో రోజు శనివారం కట్టుదిట్టంగా అమలు చేశారు. పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తూ మాస్కులు

కట్టు దిట్టంగా కర్ఫ్యూ అమలు

ఆత్మకూరు, మే 8 : నియోజకవర్గంలో పాక్షిక లాక్‌డౌన్‌ను నాలుగో రోజు శనివారం కట్టుదిట్టంగా అమలు చేశారు. పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తూ మాస్కులు లేకుండా వెళుతున్న వారిని, ద్విచక్ర వాహనాలపై ఇద్దరు వచ్చినా నిలిపివేస్తున్నారు. వీధుల్లో రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. ఆత్మకూరు పట్టణంలో నిత్యవసరాలు, కూరగాయలు ఇతరాత్ర కొనుగోలుకు ఉదయం పాక్షిక లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో పలుచోట్ల ప్రజలు భౌతికదూరం పాటించడం కనిపించింది. కూరగాయల మార్కెట్‌లో మున్సిపల్‌ సిబ్బంది భౌతిక దూరంపై సూచనలు చేస్తున్నారు.

Updated Date - 2021-05-09T04:48:30+05:30 IST