కర్ఫ్యూ ఆంక్షలు కఠినతరం

ABN , First Publish Date - 2021-05-07T03:48:43+05:30 IST

కర్ఫ్యూ రెండోరోజు ప్రశాంతంగా సాగింది. మొదటిరోజు కొంత సడలింపు ఇచ్చిన అధికారులు రెండోరోజు ఆంక్షలను కఠినతరం చేశారు. మధ్యాహ్నం 12 గంటల

కర్ఫ్యూ ఆంక్షలు కఠినతరం
పోలీసులకు సూచనలిస్తున్న ఆర్డీవో చైత్రవర్షిణి

ఆత్మకూరు, మే 6 : కర్ఫ్యూ రెండోరోజు ప్రశాంతంగా సాగింది. మొదటిరోజు కొంత సడలింపు ఇచ్చిన అధికారులు రెండోరోజు ఆంక్షలను కఠినతరం చేశారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత రహదారులు, కూడళ్లు వెలవెలబోయాయి. అత్యవసర పనులపై వెళ్లిన వారు తప్ప బయట పెద్దగా కన్పించలేదు. గత ఏడాది మార్చి 21న కర్ఫ్యూ విధించి మరసటిరోజు నుంచి లాక్‌డౌన్‌  ప్రకటించారు. ఈసారి ప్రభుత్వం కర్ఫ్యూను ప్రకటించింది. బుధవారం 12 గంటల నుంచి అమలులోకి తెచ్చింది. ఆత్మకూరు పట్టణంతో పాటు ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం, ఏఎ్‌సపేట, చేజర్ల, సంగం. మర్రిపాడు మండలాలు, ఆత్మకూరు రూరల్‌లో కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఆర్డీవో చైత్రవర్షిణి గురువారం ఆత్మకూరు పట్టణంలో అధికారులతో కలిసి పర్యటించి కర్ఫ్యూ అమలు తీరును పర్యవేక్షించారు. రవాణా రంగంపై కర్ఫ్యూ ప్రభావం కనిపించింది. ఆర్టీసీ బస్సులు మఽధ్యాహ్నం 12 గంటలకే డిపోలోకి చేరాయి. పాల ఉత్పత్తుల దుకాణాలు, మందుల షాపులు మాత్రమే తెరిచి ఉన్నాయి. వాహనాల రాకపోకలన్నీ నిలిచిపోయాయి. అంబులెన్స్‌, వైద్య సిబ్బందికి మినహాయిం పు ఇచ్చారు. కర్ఫ్యూను అమలు చేసే పోలీసు సిబ్బంది వాహనాలు మాత్రం తిరిగాయి.

Updated Date - 2021-05-07T03:48:43+05:30 IST