రోడ్డెక్కితే ఫైన్‌

ABN , First Publish Date - 2021-05-11T06:58:06+05:30 IST

కర్ఫ్యూ ఆంక్షలను తీవ్రం చేశారు. జిల్లాలోని కాకినాడ ఎస్పీ, రాజమమేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో పోలీసులు మండే ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్లను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. 12 గంటల తర్వాత ఎవ రినీ రోడ్ల మీదకు రానీయడం లేదు.

రోడ్డెక్కితే ఫైన్‌
రాజమహేంద్రవరం రోడ్లపై జనాన్ని ఆపి అవగాహన కల్పి స్తున్న పోలీసులు

  • పోలీసు దిగ్బంధంలో జిల్లా
  • 12 గంటల తర్వాత పూర్తి కర్ప్యూ
  • పగడ్బందీగా వ్యూహం
  • జిల్లాలో  మాస్కులు ధరించని 370 మందికి ఫైన్‌

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

కర్ఫ్యూ ఆంక్షలను తీవ్రం చేశారు. జిల్లాలోని కాకినాడ ఎస్పీ, రాజమమేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో పోలీసులు మండే ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్లను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. 12 గంటల తర్వాత ఎవ రినీ రోడ్ల మీదకు రానీయడం లేదు. మాస్కులు ధరించకపోతే సీరియస్‌గా తీసుకుంటున్నారు. సోమవారం మొత్తం జిల్లాలో  మాస్కులు ధరించని 373 మందికి ఫైన్‌ వేసి 29,700 వసూ లు చేశారు. అందులో రాజమహేంద్రవరంలో 74 మంది నుంచి 6,550, మిగతాచోట్ల 299 మందికి ఫైన్‌ వేసి 23,150 వసూలు చేశారు. రూ.10 వేల వరకూ ఫైన్‌ వేయమనే ఆదేశా లు ఉన్నప్పటికీ మొదట పోలీసులు నామమాత్రంగానే ఫైన్‌  వేస్తున్నారు. ఎక్కువగా అవగాహన కల్పిస్తున్నారు. మొదట రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, ఇతర పట్టణాలలో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. కొందరు ఆకతాయితా సందుల్లో నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే ఏదొక చోట వారు దొరికిపోయేలా పోలీసులు ట్రాఫిక్‌ వ్యూహం అల్లారు. ఉదయం 12 గంటల తర్వాత రోడ్డు మీద ఎవరు కనిపించినా పోలీసులు ఆపుతున్నారు. మొదట ఎందుకొచ్చారని అడుగుతున్నారు. ఈ సమయంలో రాకూడదు కదా అని హితబోధ చేస్తున్నారు. గతంలో మాదిరిగా లాఠీలతో కొట్టడంలేదు. కఠిన పదజాలం కూడా పెద్దగా ఉపయోగించడంలేదు. కానీ మాస్కులు ధరించాలని, కర్ఫ్యూ సమయంలో బయటకు రావద్దని, ఇంటికి వెళ్లిన వెంటనే స్నానం చేయాలని, చేతులు కాళ్లు శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. మాస్కులు ధరించని వారికి ఫైన్‌ వేస్తున్నారు. మరోసారి రోడ్డుమీద కనిపిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రతీ రోజు ఉదయం ఆరుగంటల నుంచి 12 గంటల వరకూ ప్రభుత్వం  కొవిడ్‌ ఆంక్షలు సడలించి వివిధ మార్కెట్‌ పనులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. కానీ చాలా దుకాణదారులు సరిగ్గా 12 గంటల వరకూ డోరు మూయడం లేదు. అప్పటివరకూ దుకాణాల వద్ద ఉన్న జనం ఇళ్లకు చేరుకోవాలంటే కర్ఫ్యూ సమయంలో రోడెక్కవలసిందే. దీంతో పోలీసులకు దొరికిపోతున్నారు. ఇటు ఆసుపత్రులన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. మద్యం షాపులు వద్ద క్యూకడుతున్నారు. మెడికల్‌  షాపుల వద్ద కూడా జనం క్యూకడుతున్నారు. కానీ ఆసుపత్రులకు వెళ్లే వారికి, ఎమర్జన్సీ కేసులకు పోలీసులు మినహాయింపు ఇస్తు న్నారు. బస్సు, రైల్వే, విమాన ప్రయాణికులు ఎవరైనా వస్తే వారిని టికెట్‌ ఆధారంగా వారి ఇళ్లకు వెళ్లడానికి వాహనాలు ఏర్పాటుచేస్తున్నారు. ప్రభుత్వం నుంచి మినహాయింపు పొంది నవారికి నిబంధనల మేరకు మినహాయింపు ఇస్తున్నారు.


Updated Date - 2021-05-11T06:58:06+05:30 IST