cow slaughter row: హనుమాన్‌ఘడ్ జిల్లాలో కర్ఫ్యూ

ABN , First Publish Date - 2022-07-28T16:27:30+05:30 IST

రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్‌ఘడ్ జిల్లాలో గోవధపై రాజుకున్న వివాదంతో కర్ఫ్యూ విధించారు...

cow slaughter row: హనుమాన్‌ఘడ్ జిల్లాలో కర్ఫ్యూ

హనుమాన్‌ఘడ్(రాజస్థాన్): రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలోని హనుమాన్‌ఘడ్ జిల్లాలో(Hanumangarh district) గోవధపై(cow slaughter) రాజుకున్న వివాదంతో కర్ఫ్యూ(curfew) విధించారు.ఈ నెల 11వతేదీన బక్రీద్(Eid) పండుగ సందర్భంగా గోవులను వధించిన వారికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొందరు నిరసన ప్రదర్శన చేశారు. నిరసనకారులకు పోలీసులకు మధ్య బుధవారం ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు హనుమాన్‌ఘడ్ జిల్లాలోని చిరియాగాంధీ పంచాయతీ, గాంధీ బడీ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. చిరియాగాంధీ పంచాయతీ, గాంధీ బడీ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ సేవలను కూడా నిలిపివేశారు.గోవులను వధించిన కేసులో నిందితులైన ఫారూఖ్, అన్వర్, అమీన్ ఖాన్, సికిందర్ ఖాన్ లను పోలీసులు అరెస్టు చేశారు. 



Updated Date - 2022-07-28T16:27:30+05:30 IST