గోవాలో ఆగస్టు 2 వరకూ కరోనా కర్స్యూ పొడిగింపు!

ABN , First Publish Date - 2021-07-26T17:51:56+05:30 IST

గోవా సర్కారు కరోనా కట్టడికి రాష్ట్రంలో అమలు చేస్తున్న కర్ఫ్యూను...

గోవాలో ఆగస్టు 2 వరకూ కరోనా కర్స్యూ పొడిగింపు!

పనాజీ: గోవా సర్కారు కరోనా కట్టడికి రాష్ట్రంలో అమలు చేస్తున్న కర్ఫ్యూను ఆగస్టు 2 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో గోవాలో మే 9 నుంచి కరోనా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. దీని దఫదఫాలుగా పొడిగిస్తూ వచ్చారు. ఈ నేపధ్యంలో పలు సడలింపులు కూడా ఇచ్చారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆగస్టు 2 వరకూ రాష్ట్రంలో కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు తెలిపారు. కాగా గోవాలో కొత్తగా 75 కరోనా కేసులు నమోదు కాగా,  ఇదే సమయంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేస్తున్నప్పటికీ కొన్నింటికి మినహాయింపు ఇచ్చారు. ఔషధ దుకాణాలకు, మెడికల్ సంబంధిత కార్యకలాపాల నిర్వహణకు కర్ప్యూ నుంచి మినహాయింపునిచ్చారు. అలాగే 50 శాతం సిట్టింగ్ సామర్థ్యంతో రెస్టారెంట్లు తెరిచేందుకు, ప్రేక్షకులు లేకుండా స్పోర్ట్స్ స్టేడియంలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 

Updated Date - 2021-07-26T17:51:56+05:30 IST