ఆర్టీసీలో అమలైన కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-06T06:44:24+05:30 IST

కొవిడ్‌ నేపథ్యంలో ఆర్టీసీలోనూ కర్ఫ్యూ అమలవుతోంది. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే బస్సుల రాకపోకలు సాగుతున్నాయి.

ఆర్టీసీలో అమలైన కర్ఫ్యూ
నిర్మానుష్యంగా ఉన్న తిరుపతి బస్టాండు

మధ్యాహ్నం 12 గంటల వరకే బస్సుల రాకపోకలు 

తిరుమలకు మినహాయింపు 

తిరుగు ప్రయాణంలో ఇబ్బంది పడుతున్న దూరప్రాంతాల భక్తులు


తిరుపతి(రవాణా), మే 5: కొవిడ్‌ నేపథ్యంలో ఆర్టీసీలోనూ కర్ఫ్యూ అమలవుతోంది. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే బస్సుల రాకపోకలు సాగుతున్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాదు వంటి నగరాలకైతే సర్వీసులను ఆపేశారు. ప్రయాణ సమయం తక్కువగా ఉన్న ప్రాంతాలకే బస్సులు నడుస్తున్నాయి. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులను దృష్టిలో ఉంచుకుని తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే బస్సులకు మినహాయింపు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. తిరుమలకు విచ్చేసే దూర ప్రాంతాల భక్తులకు తిరుగు ప్రయాణంలో బస్సుల్లేక పోవడంతో తిప్పలు తప్పడం లేదు. 


నేటినుంచి బస్సుల రాకపోకలిలా..

తిరుపతి నుంచి మదనపల్లెకు ఉదయం 6, 6.20, 6.40, 7, 9, 9.20, 9.40గంటలకు బస్సులు బస్టాండు నుంచి బయల్దేరనున్నాయి. చిత్తూరుకు ఉదయం 6 నుంచి 10.20 గంటల వరకు ప్రతి 20 నిమిషాలకో బస్సు ఉంటుంది. రాయచోటికి ఉదయం 6, 6.45, 9.20, పుంగనూరుకు ఉదయం 6, సదుంకు ఉదయం 6.30, 7, 7.20గంటలకు, కల్లూరుకు ఉదయం 7.30, 8గంటలకు, పాకాలకు 8.30, 9గంటలకు సర్వీసులుంటాయి. శ్రీకాళహస్తికి ఉదయం 6నుంచి 11గంటల వరకు ప్రతి 20 నిమిషాలకో బస్సు, పుత్తూరుకు ఉదయం 6నుంచి 11గంటల వరకు ప్రతి 20నిమిషాలకో బస్సు, పీలేరుకు ఉదయం 6.10, 6.40, 7.10, 7.30, 8, 8.30, 9, 9.30, 10, 10.15, 10.45గంటలకు బస్సులు ఉంటాయని అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌ తెలియజేశారు. భక్తులు, ప్రయాణికులు కర్ఫ్యూ దృష్ట్యా సహకరించాలని కోరారు. 

Updated Date - 2021-05-06T06:44:24+05:30 IST