Abn logo

దద్దోజనం

ఆంధ్రజ్యోతి(23-04-2020):

ఇంటిలో పెరుగన్నం చేసుకొని తినడం అలవాటే. అయితే  దసరా నవరాత్రుల సందర్భంలో  దేవాలయాల్లో  దుర్గమ్మకు నైవేధ్యంగా పెట్టే దద్దోజనం చాలా రుచిగా ఉంటుంది. అదెలా తయారుచేసుకోవాలో  తెలుసుకుందాం!


కావలసినవి: రైస్‌ - అరకప్పు, నీళ్లు - కప్పున్నర,పెరుగు - కప్పున్నర,వేడి చేసిన వెన్న తీయని పాలు - అరకప్పు, నూనె - 1 1/2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు, జీలకర్ర మినపప్పు - 1/2 స్పూను చొప్పున, ఇంగువ - చిటికెడు, పచ్చిశెనగపప్పు - ముప్పావు స్పూను కరివేపాకు - కొంచెం, అరస్పూను మిరియాలతో పొడి


తయారీ: తగినన్ని నీళ్లు పోసి అన్నం వండాలి. అన్నం ఉడికి వేడి మీద ఉన్నప్పుడే మూత తీసి గరిటెతో మెత్తటి గుజ్జులా చేయాలి. కాగబెట్టి ఉంచుకున్న పాలను అన్నంలో పోసి బాగా కలపాలి. పక్కన ఉంచి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. కడాయిలో నూనె  వేడి చేసి, ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. పచ్చిశెనగపప్పు వేసి దోరగా వేయించాలి. తరువాత కరివేపాకు, ఇంగువ, మిరియాల పొడి కలుపుకొని స్టవ్‌ ఆర్పేయాలి. ఈ తాలింపును పెరుగన్నంలో పోసి కలపాలి. అంతే రుచికరమైన దద్దోజనం రెడీ. 

పాలకూర పలావ్‌జీడిపప్పు పులావ్‌స్వీట్‌కార్న్‌ పలావ్‌ క్యారెట్ రైస్పనసకాయ బిర్యానివాంగీబాత్‌సాబూదానా కిచిడీబిసిబేళ బాత్‌కొర్రల వెజిటబుల్‌ బిర్యానినిమ్మ సద్ది
Advertisement
d_article_rhs_ad_1
Advertisement