ఈ ‘టీ’... చాలా కాస్ట్‌లీ గురూ... కప్పు రూ. 1,000/-...

ABN , First Publish Date - 2021-03-02T01:40:55+05:30 IST

ఈ హోటల్‌లో ఛాయ్ తాగాలంటే... జేబులో రూ. వెయ్యి ఉండాల్సిందే. ఎందుకంటే... ఇక్కడ ఒక్క కప్పు ఛాయ్ ఖరీదు వెయ్యి. ఆశ్చర్యపోతున్నారా ? కానీ... ఇది నిజం.

ఈ ‘టీ’... చాలా కాస్ట్‌లీ గురూ... కప్పు రూ. 1,000/-...

కోల్‌కత : ఈ హోటల్‌లో ఛాయ్ తాగాలంటే... జేబులో రూ. వెయ్యి ఉండాల్సిందే. ఎందుకంటే... ఇక్కడ ఒక్క కప్పు ఛాయ్ ఖరీదు వెయ్యి. ఆశ్చర్యపోతున్నారా ? కానీ... ఇది నిజం. అయితే మామూలు ఛాయ్ కూడా ఉంటుంది. అది మిగతా చోట్లలాటే మామూలు ఖరీదే. ఇంతా చేస్తే... అదేదో స్టార్ హోటల్ కాదు. ఓ మామూలు టీ స్టాల్. సరే...   ఇక రూ. వెయ్యి ఖరీదు చేసే టీ ఏమిటంటే ? వివరాలు చూడండి... 


కోల్‌కతాలో ఓ చిన్న టీ స్టాల్ ఉంది. దీని పేరు నీర్జష్. ఇందులో టీ తాగాలంటే జేబులో రూ. వెయ్యి పెట్టుకోవాలి. పార్థ ప్రతిమ్ గంగూలీ అనే ఓ వ్యక్తి 2014 లో కోల్‌కతలోని ముకుందాపూర్‌లో టీ స్టార్ ప్రారంభించాడు. ఇందులో పలు రకాల టీలను విక్రయిస్తున్నాడు. ఇక విషయానికొస్తే...


ఇందులో టీ ధర రూ. 12 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే కప్పు టీ రూ. వెయ్య ధర కూడా ఉంది. అయితే... ఈ వెయ్యి రూపాయాల టీ ది చాలా ప్రత్యేకమైనది. ఈ టీ స్టాల్‌లో దాదాపు వెయ్యి రకాల టీలను తయారు చేస్తారు. సోషల్ మీడియా నివేదికల ప్రకారం... రూ. వెయ్యి టీ విషయానికొస్తే... దీన్ని ‘బో లే’ టీ అని పిలుస్తారు. ఈ టీ కోసం వినియోగించే టీ పొడి ధర కిలో రూ. 3 లక్షలు.


సిల్వర్ నీడిల్ వైట్ టీ, లావెండర్ టీ, హిబిస్కస్ టీ, వైన్ టీ, బాసిల్ జింజర్ టీ, బ్లూ టిషన్ టీ, టీస్తా వాలీ టీ, కార్న్‌బరి టీ, రుబియోస్ టీ, ఒక్టి టీ ఇలా పలు రకాల టీలను ఈ స్టాల్ లో తయారు చేస్తారు. గంగూలీ తొలిగా ఓ ఉద్యోగం చేసేవాడు. ఆ తర్వాత... ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా టీ స్టాల్ ను ప్రారంభించాడు.


కాగా... ఎప్పుడూ విభిన్నంగా ఆలోచించే గంగూలీ... తన ఆలోచనలకు తగ్గట్లుగా ఖరీదైన టీ ని తయారుచేసి అమ్మడం ప్రారంభించాడు. అతను తయారు చేసే టీలలలో ఖరీదైన టీ ధర కప్పు రూ. వెయ్యి. అయ్యబాబోయ్ అనుకోకండి. అంత ఖరీదైన టీ ని ఇష్టపడి మరీ తాగే కస్టమర్లున్నారు గంగూలీకి. అదండీ విషయం. 

Updated Date - 2021-03-02T01:40:55+05:30 IST