బీవీ రాజు కళాశాలలో సాంస్కృతిక ప్రదర్శనలు

ABN , First Publish Date - 2022-06-29T05:34:18+05:30 IST

విష్ణు ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆజాదికా అమృత్‌ మహోత్సవం, అల్లూరి సీతారామరాజు 125వ జయం త్యుత్సవాలు నిర్వహించారు.

బీవీ రాజు కళాశాలలో సాంస్కృతిక ప్రదర్శనలు
విష్ణు కళాశాలలో అల్లూరి జీవిత చరిత్రపై బుర్రకథ గానం

భీమవరం ఎడ్యుకేషన్‌, జూన్‌ 28: విష్ణు ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆజాదికా అమృత్‌ మహోత్సవం, అల్లూరి సీతారామరాజు 125వ జయం త్యుత్సవాలు నిర్వహించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు చరిత్రపై బుర్ర కథ, నృత్య ప్రదర్శనలు, దేశభక్తి గీతాలు విద్యార్థులు ఆలపించారు. మున్సిపల్‌ కమిషనర్‌ శివరామకృష్ణ మాట్లాడుతూ దేశంకోసం పోరాడిన వారిని విద్యార్థులు ఆద ర్శంగా తీసుకుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.


డీఎన్నార్‌ కళాశాల అసోసియేషన్‌ విద్యాసంస్థలు కళాశాల ప్లాటినం జూబ్లీ సెమినార్‌హాల్‌లో మంగళవారం రెండో రోజు అల్లూరి సీతారామరాజు జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఏకపాత్రాభినయం, దేశభక్తి గీతాలు, ఉపన్యాసం, జానపద గేయాలు ఆలపించారు. కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గోకరాజు నరసింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు, పాలకవర్గ సభ్యులు, ప్రిన్సిపాల్‌ భాస్కరరాజు విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


అల్లూరి విగ్రహావిష్కరణలో పాల్గొందాం


భీమవరం టౌన్‌: అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహా విష్కరణ కార్యక్రమంలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా అందరం పాల్గొనాలని పలువురు వక్తలు అన్నారు. ప్రధాని మోదీ పర్యటన విజయవంతం చే యాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థలతో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో మంగళవారం సదస్సు నిర్వహించారు. శ్రీవిజ్ఞానవేదిక కన్వీనర్‌ చెరుకువాడ రంగసాయి, ఉండపల్లి రమేష్‌నాయుడు, నందమూరి రాజేష్‌, నరహరిశెట్టి కృష్ణ, మట్లపూడి సత్యనారాయణ, తదితరులు మాట్లాడారు.

Updated Date - 2022-06-29T05:34:18+05:30 IST