అన్నదాతకు సాగు నీటి కష్టాలు

ABN , First Publish Date - 2022-08-05T05:22:53+05:30 IST

ఖరీఫ్‌ ఆరంభం నుంచి వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండడంతో ఈ ఏడాది వరి సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రైతులు భావించారు.

అన్నదాతకు సాగు నీటి కష్టాలు
కొత్తూరులోని నీటితో కళకళలాడుతున్నశనగచెరువు

 చెరువు నిండినా... అందని నీరు 

 శిఽథిలమైన తూములు .... గండ్లు పడిన కాలువలు 

 వరి సాగు చేపట్టేందుకు రైతులకు తప్పని అవస్థలు 

 కొరవడిన ఐబీ శాఖ అధికారుల పర్యవేక్షణ 

జూలూరుపాడు, ఆగస్టు 4: ఖరీఫ్‌ ఆరంభం నుంచి వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండడంతో ఈ ఏడాది వరి సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రైతులు భావించారు. భారీ వర్షాలతో ఇప్పటికే చెరువులు నిండడంతో ఆయ క ట్టు రైతులు సంబుర పడ్డారు. వరి సాగును చేపట్టేందుకు నా రు సిద్ధం చేశారు. తీరా నాట్లు వేసేందుకు రైతులు దమ్ములు చేయించడానికి ఏర్పాట్లు చేశారు. కాగా తమ పొలాలకు చెరువులో నుంచి నీరు అందకపోవడంతో వారికి సాగు నీటి కష్టాలు తప్పడం లేదు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని కొత్తూరు శనగచెరువు కింద 150 మంది రైతులు 264 ఎకరాలలో ప్రతీ ఏటా వరి సాగు చేపడతారు. కానీ ఈ ఏడాది చెరువులో నుంచి ఆయ కట్టు రైతులకు నీరు అందకపోవడంతో తమ పొలాలు బీడులుగా మారతాయని వారు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది రైతులు చెరువులో నీరు అందకపోవడంతో బోర్లు వేయించుకొని సాగు చేపట్టేందుకు సిద్ధం అయ్యారు. 


శిథిలమైన తూములు.. పూడిపోయిన కాలువలు


శనగచెరువు కింద ఆయ కట్టు రైతులకు సాగు నీటిని అందించేందుకు రెండు తూములను ఏర్పాటు చేశారు. వీటిలో ఉన్న తూము పూర్తిగా శిఽథిలమైంది. రెండవ తూ ముకు ఏర్పాటు చేసిన లాకు పని చేయకపోవడంతో చెరు వు చుక్క నీరు రైతులకు అందే పరిస్థితి లేకుండా పోయిం ది. చెరువులో నీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన కాలువలు కొన్ని చోట్ల పూడిపోయాయి. మరికొన్ని చోట్ల గండ్లు పడి పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయి. దీం తో రైతులు పంట సాగు చేసేందుకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అలుగుకు ఏర్పాటు చేసిన గోడ కు రంద్రం పడడంతో చెరువులోని నీరు సమీపంలోనితుమ్మల వాగులోకి వృథాగా పోతుందని రైతులు వాపోతున్నారు. 


కొరవడిన ఐబీ అధికారుల పర్యవేక్షణ ..


చెరువుల్లో పూడిక తీత పనులను చేపట్టి రైతులకు సాగు నీరు అందించే విధంగా ఇరిగేషన్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాగా కొత్తూరు శనగచెరువుతో పాటు, మండలంలోని పలు చెరువులను ఐబీ అధికారులు సందర్శించి పర్యవేక్షించడం లేదని ఆయ కట్టు రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో చెరువులు అడవుల్లా మారి దర్శనమిస్తున్నాయని రైతులు అంటున్నారు. శనగచెరువు పరిధిలోని ఆయ కట్టు రైతులు వరి సాగు చేపట్టేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. 


సాగు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలి 

 పిజి.కృష్ణమూర్తి, ఆయకట్టు నీటి సంఘం మాజీ అధ్యక్షుడు


శనగచెరువు తూములు శిఽథిలం కావడంతో రైతులకు నీరు అం దే పరిస్థితి లేకుండా పోయింది. ఐబీ శాఖ అధికారులు తూముల కు, కాలువలకు మరమ్మత్తులను చేపట్టి రైతులకు నీటిని అందించి కష్టాలను తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలి. 


అధికారులు నిర్లక్ష్యం వీడాలి

చండ్ర వెంకటేశ్వర్లు, ఆయకట్లు రైతు, కొత్తూరు


వరి సాగుకు నీరు అందకపోవడంతో పంటను సాగు చేసేందుకు శనగచెరువు ఆయ కట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఐబీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు. తక్షణమే మరమ్మతులను చేసి నీటిని అందించాలని కోరుతున్నాను. 


చెరువును పరిశీలించి చర్యలు తీసుకుంటాం

 మీనా, ఏఈ, ఇరిగేషన్‌ శాఖ


కొత్తూరు శనగచెరువును పరిశీలించి రైతుల ఇబ్బందులను తొలిగిస్తాం. తూములకు మరమ్మతులను చేపట్టి నీటిని అందించేలా చర్యలు తీసుకుంటాం. 


Updated Date - 2022-08-05T05:22:53+05:30 IST