ఆయిల్‌ పాం పంటల సాగు లాభదాయకం

ABN , First Publish Date - 2021-07-31T05:37:56+05:30 IST

రైతులు పంటల సాగులో భాగంగా ఆయిల్‌ పాం పంటలు సాగుచేస్తే లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయాధికారి ఏడీఏ అంజనేయులు అన్నారు.

ఆయిల్‌ పాం పంటల సాగు లాభదాయకం
సమావేశంలో మాట్లాడుతున్న వ్యవసాయాధికారి ఆంజనేయులు

బిచ్కుంద, జూలై 30: రైతులు పంటల సాగులో భాగంగా ఆయిల్‌ పాం పంటలు సాగుచేస్తే లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయాధికారి ఏడీఏ అంజనేయులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఆయిల్‌పాం పంటల సాగుపై రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూనె ఉత్పత్తులు పెంచేందుకు ఆయిల్‌పాం సాగుచేసే రైతులకు సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ రైతు ముందుగా ఎకరం భూమిలో ఆయిల్‌పాం పంటలను సాగు చేయడానికి ముందు కు రావాలని ఆయన అన్నారు. పంటల సాగులో రైతులకు వ్యవసాయాధికారులు ఆయిల్‌ కంపెనీల వారు సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బస్వరాజ్‌ పటేల్‌, సొసైటీ చైర్మన్‌ బాలు, టీఆర్‌ఎస్‌ మండల అఽధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్‌, మండల వ్యవసాయాధికారి పోచయ్య, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.
పద్మాజీవాడిలో..
సదాశివనగర్‌: ఆయిల్‌పాం తోటల సాగుపై రైతులు దృష్టి సారించాలని ఆయిల్‌పాం జనరల్‌ మేనేజర్‌ సాంబమూర్తి అన్నారు. మండలంలోని పద్మాజీవాడి రైతు వేదిక భవనంలో శుక్రవారం వ్యవసాయదారులకు శిక్షణ కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటిన మూడు సంవత్సరాల నుంచి రైతులకు ఎలాంటి పెట్టుబడులు లేకుండా ప్రతినెల ఆదాయం పొందడానికి ఆయిల్‌ పాం తోటలు ఉపయోగపడతాయన్నారు. మూడు సంవత్సరాల వరకు అంతర పంటలు వేసుకుంటూ ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రజాపతి, ఆయిల్‌పామ్‌ సంస్థ డీపీఎం మాణిక్‌రెడ్డి, ఫీల్డ్‌ ఎగ్జీక్యూటివ్‌ సత్యనారాయణ, హార్టికల్చర్‌ అధికారి లోకేష్‌, ఏఈవో స్నేహలత పాల్గొన్నారు.
తిప్పాపూర్‌లో..
భిక్కనూరు: ఆయిల్‌ పాం తోటల పెంపకంతో రైతులకు అధిక లాభాలు చేకూరుతాయని ఏడీఏ శశిధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భిక్కనూరు మండలం తిప్పాపూర్‌ గ్రామంలో ఆయిల్‌ పాం తోటల పెంపకంపై రైతులకు రైతువేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ ఆయిల్‌ పాం తోటల పెంపకాన్ని తక్కువ పెట్టుబడితో ప్రారంభించి ఎక్కువ లాభాలు పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ స్వామి, ఆయిల్‌ పాం కంపెనీ ఎండీ సాంబమూర్తి, ఆర్‌ఎస్‌ఎస్‌ కన్వీనర్‌ దుర్గారెడ్డి, ఏఈవో అఖిలేష్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T05:37:56+05:30 IST