ఆశల సాగు

ABN , First Publish Date - 2022-06-28T05:49:42+05:30 IST

ఆశల సాగు

ఆశల సాగు
మాధన్నపేటలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మొక్కజొన్న చేసు

జిల్లాలో ఖరీఫ్‌ సాగు లక్ష్యం 3.15లక్షల ఎకరాలు

1.31 లక్షల ఎకరాల్లో వరి, 1.21 లక్షల ఎకరాల్లో పత్తి సాగు

మూడో స్థానంలో మొక్కజొన్న 


నర్సంపేట, జూన్‌ 27: తొలకరి వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఉత్సాహంగా వ్యవసాయ పనులను మొదలుపెట్టారు. జూన్‌ రెండో వారం నుంచి తరచూ మోస్తరు వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్‌పై రైతుల్లో ఆశలు చిగురించాయి. వర్షాలు ప్రారంభం కావడంతో జిల్లాలో ఖరీఫ్‌లో 3.15 లక్షల ఎకరాల్లో పంటసాగయ్యే అవకాశముందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది 3.09లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా, ఈ ఏడాది 3,15,947 ఎకరాల్లో సాగు చేయించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. గతేడాది జిల్లాలో లక్షా 33వేల 882 ఎకరాల్లో వరి సాగు కాగా, ఈసారి లక్షా 31వేల 817 ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. గత ఏడాది మొక్కజొన్న 21,185 ఎకరాల్లో సాగు కాగా, ఈ సారి 21,932 ఎకరాలు,  గత సంవత్సరం పత్తి 1,09,571 ఎకరాల్లో సాగుకాగా ఈసారి 1.21లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు. 


గత ఏడాది వేరుశనగ 5,444 ఎకరాలు కాగా, ఈ ఎడాది 5,027 ఎకరాల్లో సాగవుతుందని నిర్ధారించారు. గత సంవత్సరం పెసర 484 ఎకరాలు కాగా, ఈసారి 555 ఎకరాల్లో సాగుకానుంది. గత ఏడాది కందులు 2,192 ఎకరాల్లో సాగయింది. ఈఏడాది 3వేల ఎకరాల్లో సాగువుతుందని వ్యవసాయశాఖ అధికారులు ప్రతిపాదించారు. గత ఏడాది ఎర్ర మిర్చి 19,032 ఎకరాల్లో పండించగా, ఈ ఏడాది 16,373 ఎకరాల్లో సాగవుతుందని అంచనా. గత ఏడాది పసుపు 5,672 ఎకరాల్లో సాగయింది. ఈ ఏడాది 5,602 ఎకరాల్లో సాగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం ఇతర పంటలు 12,333 ఎకరాల్లో సాగుకాగా ఈసారి 10,635 ఎకరాల్లో సాగవుతుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో పత్తి, కంది పంటల సాగు విస్తీర్ణం పెంచడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 


అందుబాటులో ఎరువులు

ఖరీఫ్‌ సీజన్‌లో 1,34,500 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం కాగా ఇప్పటివరకు 13,700 మెట్రిక్‌ టన్నుల ఎరువులు నిల్వ ఉన్నాయి. ఎరువుల వివరాలు ఇలా ఉన్నాయి... యూరియా 58వేల మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా 7,100 మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వ ఉంది. డీఏపీ 18వేల మెట్రిక్‌ టన్నులకు వెయ్యి మెట్రిక్‌ టన్నులు ఉన్నాయి. కాంప్లెక్స్‌ 40వేల మెట్రిక్‌ టన్నులకు 5వేల మెట్రిక్‌ టన్నులు నిల్వ ఉన్నాయి. ఎం.వో.పి 13వేల మెట్రిక్‌ టన్నులకు 500 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నాయి. ఎస్‌.ఎస్‌.పి ఎరువులు 5,500 మెట్రిక్‌టన్నులకు 100 మెట్రిక్‌ టన్నులు నిల్వ ఉన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఉషాదయాళ్‌ తెలిపారు. 


జూలై మొదటి వారంలో వరి నారుమళ్లు

తొలకరి వర్షాలు కురవడంతో రైతులు ఖరీఫ్‌ పనులను ప్రారంభించారు. దుక్కులు దున్ని పత్తి, మొక ్కజొన్న, బొబ్బెర్లు, వేరుశనగ తదితర విత్తనాలను నాటుతున్నారు. జూలై మొదటి వారంలో వరినారు మళ్లను పోసుకునేందుకు రైతుల సిద్ధమవుతున్నారు. వరి సాగుచేసే రైతులు పొలాలు దున్ని జీలుగుచల్లి పచ్చిరొట్ట ఎరువుల కోసం దుక్కులు దున్నుతున్నారు.

Updated Date - 2022-06-28T05:49:42+05:30 IST