ఫార్మా భూముల్లో పంటల సాగు

ABN , First Publish Date - 2021-04-19T04:52:30+05:30 IST

యాచారం మండలంలోని కుర్మిద్ద, కుర్మిద్దతండా, మేడిపల్లి, తాడిపర్తి,

ఫార్మా భూముల్లో పంటల సాగు
ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో సాగు చేసిన వరిపంట

యాచారం : యాచారం మండలంలోని కుర్మిద్ద, కుర్మిద్దతండా, మేడిపల్లి, తాడిపర్తి, నానక్‌నగర్‌ గ్రామాల్లో ఫార్మాసిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం పట్టా, అసైన్డ్‌ భూములు తీసుకున్న సంగతి పాఠకులకు విధితమే. కాగా ఆయా గ్రామాల్లో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల చుట్టూ ఫెన్సింగ్‌ కూడా వేశారు. అయినా చాలామంది రైతులు తమకు పరిహారం పూర్తిస్థాయిలో రాలే దని, అందుకే పంటలు సాగు చేసుకున్నామని చెబుతున్నారు. గత ఖరీఫ్‌లో మెట్టపంటలతోపాటు వరి, కూరగాయ తోటలు సాగు చేశారు. ప్రస్తుతం రబీలో కూడా కంచెను దాటి ఫార్మాసిటీ భూముల్లో వరి పంటలు విస్తారంగా సాగు చేశారు. ఫెన్సింగ్‌తో అడవిపందుల బెడద లేకుండా పోయిందని రైతులు చెప్తున్నారు.



Updated Date - 2021-04-19T04:52:30+05:30 IST