సాగుచట్టాలు రైతుల భవిష్యత్‌కు ఉరితాళ్లు

ABN , First Publish Date - 2021-01-27T06:14:48+05:30 IST

వ్యవసాయం ఇరుసుగా నడుస్తున్న దేశ ఆర్థికాభివృద్ధిని దెబ్బతీసి రైతుల భవిష్యత్‌కు మోదీ ప్రభుత్వం సాగు చట్టాల ద్వారా ఉరితాళ్లు పేనిందని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర రైతుసంఘం ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.

సాగుచట్టాలు రైతుల భవిష్యత్‌కు ఉరితాళ్లు
మిర్యాలగూడలో ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్న జూలకంటి రంగారెడ్డి

మిర్యాలగూడ ర్యాలీ సభలో జూలకంటి రంగారెడ్డి 

 జిల్లా వ్యాప్తంగా ట్రాక్టర్ల ర్యాలీలో

మిర్యాలగూడ/ దేవరకొండ/ మర్రిగూడ/ చిట్యాల/ నార్కట్‌పల్లి/ నకిరేకల్‌/నల్లగొండ రూరల్‌/ తిప్పర్తి/ శాలిగౌరారం/ మునుగోడు, జనవరి 26:  వ్యవసాయం ఇరుసుగా నడుస్తున్న దేశ ఆర్థికాభివృద్ధిని దెబ్బతీసి రైతుల భవిష్యత్‌కు మోదీ ప్రభుత్వం సాగు చట్టాల ద్వారా ఉరితాళ్లు పేనిందని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర రైతుసంఘం ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మూడు సాగుచట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పోరాడుతున్న రైతులకు మద్దతుగా  నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మంగళవారం ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.  ర్యాలీకి ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాల నేతలు మద్దతు పలికారు. మిర్యాలగూడ కళాశాల మైదానంలో జరిగిన సభలో జూలకంటి రంగారెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో దేవరకొండ మండలం పడ్మట్‌పల్లి నుంచి దేవరకొండ వరకు ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. మర్రిగూడ మండలంలోని తమడపల్లి గ్రామంలో సీపీఐ ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. పీఎన్‌ఎం జిల్లా అధ్యక్షుడు చల్లం పాండురంగరావు మాట్లాడారు. చిట్యాలలో సీపీఎం ఆధ్యర్యంలో ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిట్ట నగేష్‌, నారబోయిన శ్రీనివాసులు, శీలా రాజయ్య, రుద్రారపు పెద్దులు పాల్గొన్నారు. నార్కట్‌పల్లిలో సీపీఐ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌ లొడంగి శ్రవణ్‌కుమార్‌, ఆటో యూనియన్‌ అధ్యక్షుడు ఎస్‌కే రఫీ పాల్గొన్నారు.  నకిరేకల్‌లో రైతు సంఘం ట్రాక్టర్‌ ర్యాలీలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాళ ప్రమీళ మాట్లాడారు. కార్యక్రమంలో సాకుంట్ల నర్సింహ, యానాల క్రిష్ణారెడ్డి, బొజ్జ చిన్నవెంకులు, వంటెపాక వెంకటేశ్వర్లు, బోళ్ల నర్సింహారెడ్డి,  మర్రి వెంకటయ్య, ఏర్పుల తాజేశ్వర్‌, వంటెపాక కృష్ణ, రాచకొండ వెంకట్‌ పాల్గొన్నారు.  కేంద్ర ప్రభుత్వం తీరుసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు తెలంగాణ రైతుం సంఘం ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని పానగల్‌ బైపాస్‌ రోడ్డు ఇందిరాగాంధీ విగ్రహం నుంచి సుమారు 450 టాక్టర్లతో టాక్టర్‌ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ బస్టాండ్‌, భాస్కర్‌ టాకిస్‌, దేవరకొండ రోడ్డు లోని సాగర్‌ చౌవరస్తా నుంచి మర్రిగూడ బైపాస్‌ వరకు సాగింది.  పెద్ద గడియారం వద్ద ఏర్పాటు చేసిన  జాతీయ జెండాను స్వాతంత్య్ర సమరయోధుడు పెన్నా అనంతరామశర్మ అవిష్కరించారు. కార్యక్ర మంలో బండా శ్రీశైలం, నాగిరెడ్డి, నారి అయిలయ్య, పాలడుగు నాగార్జున, సయ్యద్‌హాషం, మొహమ్మద్‌ సలీం, నర్సిరెడ్డి, దండెంపల్లి సత్తయ్య పాల్గొన్నారు. తిప్పర్తి మండలం యాపలగూడెం, తిప్పర్తి, పజ్జూరు గ్రామాల నుంచి ట్రాక్టర్లు ర్యాలీలో పాల్గొన్నాయి. శాలిగౌరారం మండలంలోని ఊట్కూరు గ్రామంలో ఎడ్ల బండ్లతో రైతులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ, సీపీఎం నాయకులు నాయకుడు రాయి కృష్ణ, రావుల లింగయ్య, వెంకన్న, బత్తిని అనిల్‌, బండారి వెంకన్న పాల్గొన్నారు. మునుగోడులో నిర్వహించిన ర్యాలీలో సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, నాయకులు మందడి నర్సిరెడ్డి, గురిజ రామచంద్రం, సురిగి చలపతి, అంజయ్యచారి పాల్గొన్నారు.


Updated Date - 2021-01-27T06:14:48+05:30 IST