సాగు భారమే!

ABN , First Publish Date - 2022-06-22T05:53:27+05:30 IST

వానాకాలం పంటల సీజన్‌ మొదలైంది. రైతులు దు క్కులు దున్ని పొలాలను సిద్ధం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కొనుగోళ్లకు పెట్టుబడి కోసం వెతుకులాట ప్రారంభించారు. గత మూడు సంవత్సర?లుగా ఊరిస్తున్న రుణమాఫీ అమ లు కాకపోవడంతో రైతులు బ్యాంకుల వద్దకు వెళ్లే పరిస్థితి లేదు. రుణాలు చెల్లించకపోవడంతో వ్యవసాయ ఉ త్పత్తులు అమ్మగా వచ్చిన నగదును బ్యాంకర్లు పాత అప్పులు కిం ద జమచేసుకుంటున్నారు. ఇటు బ్యాంకర్లు రుణాలు ఇవ్వక మరోవైపు ప్రభుత్వం రైతుబంధు నిధులను జమచేయడం లేదు. దీంతో రైతులు అప్పుల కోసం వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

సాగు భారమే!
ట్రాక్టర్‌తో పొలాలను దున్నతున్న దృశ్యం

మరింత పెరిగిన పెట్టుబడి ఖర్చులు 

విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల ధరలకు రెక్కలు

పెట్రోల్‌, డీజిల్‌ ధరల ప్రభావం 

అందని రుణాలు 

రైతుబంధు విడుదల చేయని ప్రభుత్వం 

కామారెడ్డి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): వానాకాలం పంటల సీజన్‌ మొదలైంది. రైతులు దు క్కులు దున్ని పొలాలను సిద్ధం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కొనుగోళ్లకు పెట్టుబడి కోసం వెతుకులాట ప్రారంభించారు. గత మూడు సంవత్సర?లుగా ఊరిస్తున్న రుణమాఫీ అమ లు కాకపోవడంతో రైతులు బ్యాంకుల వద్దకు వెళ్లే పరిస్థితి లేదు. రుణాలు చెల్లించకపోవడంతో వ్యవసాయ ఉ త్పత్తులు అమ్మగా వచ్చిన నగదును బ్యాంకర్లు పాత అప్పులు కిం ద జమచేసుకుంటున్నారు. ఇటు బ్యాంకర్లు రుణాలు ఇవ్వక మరోవైపు ప్రభుత్వం రైతుబంధు నిధులను జమచేయడం లేదు. దీంతో రైతులు అప్పుల కోసం వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. 

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 

పంటల సాగు పెట్టుబడులపై   పెట్రోల్‌, డీజిల్‌ ధరల ప్రభావం ఎక్కు వగా చూపుతుంది. సుమారు రెండు కూడా రూ. 100 దాటడంతో చేరడంతో ట్రాక్టర్‌ కిరాయి ధరలు విపరీతంగా పెరిగాయి. గత ఏడాది గొర్ర్‌ కొట్టడానికి ఎకరానికి రూ.1500 నుంచి రూ.1800 వరకు ఉండగా ఈ ఏడాది ట్రాక్టర్‌ యాజమానులు ఆ ధరలను రూ.2 వేల నుంచి రూ. 2500లకు పెంచారు. ఎకరం దుక్కి దున్నితే రూ.3 వేల వరకు తీసుకుంటున్నారు.దమ్ముల కిరాయి రేట్లు సైతం విఫరితంగానే పెరిగాయి. దీంతో ఒక్కో ఎకరానికి ట్రాక్టర్‌ ఖర్చులే రూ.3 వేల వరకు అదనపు భారం పడనుంది. మరో వైపు పెరిగిన నిత్యవసర ధరలను దృష్టిలో పెట్టుకుని కూలీలు ఈ ఏడాది తొలకరి నుంచే ధరలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాలో గత ఏడాది మహిళ కూలీలకు రోజుకు రూ.200 నుంచి రూ.250 వరకు చెల్లించగా, ఈ ఏడాది రూ.250 నుంచి రూ.300 వరకు ఇవ్వాలని అడుగుతున్నారు. ఇక పురుషులకు గత ఏడాది రూ.450 నుంచి రూ.500 వరకు ఉండగా ప్రస్తుతం రూ. 600 డిమాండ్‌ చేస్తున్నారు. 

పెరిగిన విత్తనాల ధరలు

ఈసీజన్‌లో ఎక్కువగా వరితో పాటు మొక్కజొన్న, సోయా,పత్తి పంట లు సాగుకానున్నాయి. అయితే పెట్టుబడి ఖర్చులు గతంలో కంటే సుమా రు 30 శాతం పెరగనున్నాయి. గత ఏడాది రూ.750 ఉన్న పత్తి గింజల ప్యాకెట్‌ ధర ఈ ఏడాది రూ.810కి పెరిగింది. అలాగే వరి,మొక్కజొన్న వి త్తనాల ధరలు కూడా పెరిగాయి. గత ఏడాది పోలీస్తే పురుగుల మందుల ధరలు 35 శాతం పెరిగా యి. దీంతో ఎకరానికి కనీసం 3 వేల రూ పాయల వరకు పెట్టుబడి      ఖ ర్చు పెరుగనుంది.

ఎరువుల ధరలు పైపైకి

ఎరువుల వి షయానికి వస్తే యూరియా తప్ప మిగితా కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. కాంప్లెక్స్‌ ఎరువులలో డీఏ పీటీ మాత్రమే కేం ద్రం రాయితీ ఇ స్తుంది. మిగితా వాటి ధరలు పెరిగాయి. 20:20:0:30 బస్తా ధర గత ఏడాది రూ.1250 ఉండగా ప్రస్తుతం రూ.1500 లకు పెరిగింది. పె రిగిన ధరలతో ఎక రానికి అదనంగా 2 వేల రూపాయల వరకు ఖర్చు అవు తుంది.

Updated Date - 2022-06-22T05:53:27+05:30 IST