కీరా పరాటా

ABN , First Publish Date - 2020-02-16T16:25:29+05:30 IST

కీరా దోస ముక్కలు - ఒక కప్పు, పచ్చిమిర్చి - 2, అల్లం - అరంగుళం ముక్క, గోధుమపిండి - ఒక కప్పు, శనగపిండి - రెండు టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర పొడి - అర టీ స్పూను, వాము - అర టీ స్పూను, పసుపు -

కీరా పరాటా

కావలసిన పదార్థాలు: కీరా దోస ముక్కలు - ఒక కప్పు, పచ్చిమిర్చి - 2, అల్లం - అరంగుళం ముక్క, గోధుమపిండి - ఒక కప్పు, శనగపిండి - రెండు టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర పొడి - అర టీ స్పూను, వాము - అర టీ స్పూను, పసుపు - చిటికెడు, పంచదార - పావు టీ స్పూను, నూనె లేదా నెయ్యి - కాల్చడానికి, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర + పుదీనా తరుగు - అరకప్పు. 

తయారుచేసే విధానం: మిక్సీలో దోస ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి రుబ్బుకోవాలి. ఒక లోతైన పాత్రలో ఈ మిశ్రమాన్ని వేసి అందులో గోధుమపిండి, ఉప్పు, శనగపిండి, వాము, జీలకర్ర పొడి, పసుపు, పంచదార బాగా కలిపి ఒక టీ స్పూను నెయ్యి వేసి ముద్దగా కలుపుకోవాలి. పిండి తక్కువైతే మరికొంత కలుపుకోవచ్చు. ఈ ముద్దని పావుగంట పక్కనుంచాలి. తర్వాత కొంత కొంత పిండిని తీసుకొని మీకు ఇష్టమైన ఆకారంలో పరాటాలు చేసుకుని పెనంపై నూనె లేదా నెయ్యితో రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. ఇవి నిమ్మ/టమోటా పచ్చడితో బాగుంటాయి. 

Updated Date - 2020-02-16T16:25:29+05:30 IST