కీరదోస - తులసి పానీయం

ABN , First Publish Date - 2021-04-22T05:30:00+05:30 IST

ఈ పానీయం వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతుంది. ఈ డ్రింక్‌ తయారీకోసం...

కీరదోస - తులసి పానీయం

ఈ పానీయం వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతుంది. ఈ డ్రింక్‌ తయారీకోసం...


కావలసినవి:

కీరదోస - ఒకటి, తులసి ఆకులు - ఎనిమిది, స్వీట్‌ సిరప్‌ - 60ఎంఎల్‌, సోడా - కొద్దిగా.


తయారీ విధానం:

  1. ముందుగా కీరదోస పొట్టు తీసి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.
  2. ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని అందులో దోస ముక్కలు వేసి కరిగిపోయే వరకు కలుపుకోవాలి.
  3. మరో గ్లాసులో తులసి ఆకులు తీసుకోవాలి. తరువాత అందులో స్వీట్‌ సిరప్‌ పోయాలి. 
  4. ఇప్పుడు దోసముక్కలు కరిగించిన నీళ్లు పోయాలి. చివరగా సోడా పోసి చల్లగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2021-04-22T05:30:00+05:30 IST