సీటీఎఫ్‌కు ఉత్తరాఖండ్‌ పోలీసుల ప్రశంసలు

ABN , First Publish Date - 2022-08-09T06:55:56+05:30 IST

సీటీఎఫ్‌కు ఉత్తరాఖండ్‌ పోలీసుల ప్రశంసలు

సీటీఎఫ్‌కు ఉత్తరాఖండ్‌ పోలీసుల ప్రశంసలు
ఉత్తరాఖండ్‌ పోలీసుల ప్రశంసలందుకున్న సిటీ టాస్క్‌ఫోర్స్‌ బృందం

విజయవాడ, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): పోలీసు కమిషనర్‌ ఆధీ నంలో పనిచేసే సీటీఎఫ్‌(సిటీ టాస్క్‌ఫోర్స్‌) ఉత్తరాఖండ్‌ పోలీసుల ప్రశం సలను అందుకుంది. కరుడుగట్టిన సుపారీ నేరగాడ్ని పట్టుకుని అప్పగిం చినందుకు ఉత్తరాఖండ్‌ పోలీసు ఉన్నతాధికారుల మన్ననలను పొందింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్‌కు చెందిన సుపారీ హంతకుడు ఉత్త రాఖండ్‌లో బీజేపీ ప్రజాప్రతినిధిని హత్య చేశాడు. ఆ కేసులో అక్కడి పోలీ సులకు దొరకకుండా విజయవాడకు పారిపోయి వచ్చాడు. ఇక్కడ ఆటో నగర్‌లో ఓ షెడ్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. నిందితుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడన్న అనుమానంతో ఉత్తరాఖండ్‌ పోలీసులు అటు తెలంగాణ, ఇటు ఏపీ పోలీసులకు లేఖలు రాశారు. పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాస్క్‌ ఫోర్స్‌లోని ఒక బృందానికి సుపారీ హంతకుడ్ని పట్టుకునే బాధ్యతలను అప్పగించారు. ఏసీపీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఆర్‌ఎంవీ పురు షోత్తం, హెడ్‌కానిస్టేబుల్‌ నాగమల్లేశ్వరరావు, కానిస్టేబుళ్లు రామకృష్ణ, నాగ రాజు కలిసి ఆటోనగర్‌లో సుపారీ హంతకుడ్ని పట్టుకున్నారు. రెండు నెలల క్రితం ఉత్తరాఖండ్‌ పోలీసులు వచ్చి నిందితుడిని తీసుకెళ్లారు. దీనిపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను అభినందిస్తూ ఉత్తరాఖండ్‌ పోలీసులు ప్రశం సాపత్రాలను పంపారు. వాటిని ఏడీసీపీ వెంకటరత్నం సిటీ టాస్క్‌ఫోర్స్‌ బృందానికి సోమవారం అందజేశారు. 



Updated Date - 2022-08-09T06:55:56+05:30 IST