Suresh Raina: బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు నాకు అభ్యంతరం లేదు...

ABN , First Publish Date - 2021-09-14T14:22:34+05:30 IST

ప్రముఖ టీవీ షో బిగ్ బాస్‌లో పాల్గొనడానికి తనకు అభ్యంతరం లేదని భారత మాజీ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా వ్యాఖ్యానించారు....

Suresh Raina: బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు నాకు అభ్యంతరం లేదు...

న్యూఢిల్లీ : ప్రముఖ టీవీ షో బిగ్ బాస్‌లో పాల్గొనడానికి తనకు అభ్యంతరం లేదని భారత మాజీ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా వ్యాఖ్యానించారు. సురేష్ రైనా, అతని భార్య ప్రియాంకలు కలిసి ‘సూపర్ కపుల్’ అనే యూట్యూబ్ సిరీస్ మొదటి ఎపిసోడ్‌లో తాజాగా నటించారు.‘‘దక్షిణ భారతదేశం అయిన బిగ్ బాస్‌కు వెళ్లడానికి నాకు అభ్యంతరం లేదు. నేను దానిని చూశాను. వారి భాష నేర్చుకోవాలి’’ అని సురేష్ రైనా నవ్వుతూ వ్యాఖ్యానించారు.ఇప్పటికే ఆండ్రూ సైమండ్స్, ఎస్ శ్రీశాంత్, సలీల్ అంకోలా, వినోద్ కాంబ్లీ, నవజోత్ సింగ్ సిద్ధు,ది గ్రేట్ ఖలీ వంటి వారు రియాలిటీ షో బిగ్ బాస్‌లో భాగం అయ్యారు. 


తన ఆరేళ్ల వివాహబంధం గురించి మాట్లాడుతూ రైనా రొమాంటిక్ అయి, తాను ప్రియాంకను మొదటిసారి ఎలా కలుసుకున్నానో వెల్లడించాడు. ‘‘నా సోదరుడి భార్య, ప్రియాంకలు కలిసి చదువుకునేవారు, ప్రియాంకకు నా సోదరుడు ట్యూషన్ చెప్పేవాడు’’ అని రైనా చెప్పారు. తాను 2008వ సంవత్సరంలో ఆస్ట్రేలియా నుంచి వచ్చినపుడు విమానాశ్రయంలో ప్రియాంకను మొదటిసారి కలిశానని రైనా గుర్తు చేసుకున్నారు.తనకు ప్రియాంక లాంటి భార్య లభించడం తన అదృష్టమని, ఆరేళ్ల తమ వైవాహిక జీవితంలో మధురమైన క్షణాలున్నాయని సురేష్ రైనా చెప్పారు. 


Updated Date - 2021-09-14T14:22:34+05:30 IST