డూ ప్లెసిస్ వీరబాదుడు.. ఈ సీజన్లో తొలిసారి 200 దాటిన చెన్నై స్కోర్..

ABN , First Publish Date - 2021-04-22T03:07:56+05:30 IST

ఐపీఎల్14వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై ఆదరగొట్టింది. బ్యాట్స్ మెన్ విజృంభణతో..

డూ ప్లెసిస్ వీరబాదుడు.. ఈ సీజన్లో తొలిసారి 200 దాటిన చెన్నై స్కోర్..

ముంబై: ఐపీఎల్14వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై ఆదరగొట్టింది. బ్యాట్స్ మెన్ విజృంభణతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లను 220 పరుగుల భారీ స్కోరు చేసింది. ఋతురాజ్ గైక్వాడ్(64: 42 బంతుల్లో.. 6 ఫోర్లు, 4 సిక్సులు), డూ ప్లెసిస్(95: 60 బంతుల్లో.. 9 ఫోర్లు, 4 సిక్సులు) సూపర్ ఓపెనింగ్ ఇచ్చారు. గైక్వాడ్ ఔటైన తర్వాత క్రీజులోకొచ్చిన మొయిన్ అలీ(25: 12 బంతుల్లో.. 2 ఫోర్లు, 2 సిక్సులు) వచ్చేయి రావడంతోనే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే నరైన్ ఓ మ్యాజిక్ బాల్ తో అలీని ఔట్ చేశాడు. అలీ తర్వాత కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ(17: 8 బంతుల్లో.. 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా బ్యాటు ఝుళిపించాడు. కానీ రస్సెల్ ఓ ఆఫ్ స్టంప్ ఔట్ సైడ్ డెలివరీని బౌండరీ కొట్టబోగా.. షార్ట్ కవర్లో ఫీల్డింగ్ చేస్తున్న కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ డైవ్ చేసి మరీ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అయితే చివరి ఓవర్లో డూ ప్లెసిస్ 2 సిక్సులు బాదగా.. రవీంద్ర జడేజా(6: 1 బంతుల్లో.. 1 సిక్స్) సిక్స్ తో ఇన్నింగ్స్ ముగించాడు. అయితే డూ ప్లెసిస్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, కమిన్స్ లకు తలా ఓ వికెట్ తీశారు.

Updated Date - 2021-04-22T03:07:56+05:30 IST