పేసర్ కేఎం అసిఫ్‌పై వస్తున్న వార్తలను ఖండించిన సీఎస్‌కే

ABN , First Publish Date - 2020-10-01T23:47:07+05:30 IST

చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ కేఎం అసిఫ్ దుబాయ్ హోటల్‌లోని బయో సెక్యూర్ బబుల్‌ నుంచి బయటకు వచ్చి రిసెప్షన్ ప్రాంతానికి వెళ్లినట్టు

పేసర్ కేఎం అసిఫ్‌పై వస్తున్న వార్తలను ఖండించిన సీఎస్‌కే

దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ కేఎం అసిఫ్ దుబాయ్ హోటల్‌లోని బయో సెక్యూర్ బబుల్‌ నుంచి బయటకు వచ్చి రిసెప్షన్ ప్రాంతానికి వెళ్లినట్టు వస్తున్న వార్తలను ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ కొట్టిపడేశారు. లాబీలో ఆటగాళ్ల కోసం ప్రత్యేక స్థలం ఉందని, అక్కడున్న సిబ్బందిని క్రమం తప్పకుండా టెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు.


అసలు ఏం జరిగిందనే విషయాన్ని నిర్ధారించుకున్నారో, లేదో తనకు తెలియదని పేర్కొన్నారు. ఎందుకంటే లాబీలో రిసెప్షన్ ఉందని తెలిపారు. సీఎస్‌కే బృందానికి సాయం చేసేందుకు ప్రత్యేక బృందం ఉందన్నారు. తమ కోసం ప్రత్యేకంగా ఓ బృందం పనిచేస్తుందన్న విషయం ఆటగాళ్లకు తెలుసని, అక్కడి సాధారణ సిబ్బందితో మాట్లాడేందుకు అసిఫ్ వెళ్లడని విశ్వనాథన్ స్పష్టం చేశారు.


తాళం మర్చిపోతే మరోదాని కోసం అతడు వెళ్లాడన్నదే నిజమని వివరించారు. దీనికి అతిశయోక్తులు జోడించి చెప్పడం సరికాదని, వాస్తవాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. 


అంతవరకు ఎందుకని, ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఉన్న ఫ్లోర్లలోకి తానే వెళ్లనని, అధికారుల కోసం ఏర్పాటు చేసిన బబుల్‌ కంటే వారిది భిన్నంగా ఉంటుందని సీఈవో తెలిపారు. తాము సాధ్యమైనంత వరకు పలు జాగ్రత్త తీసుకుంటున్నట్టు చెప్పారు.


అసిఫ్ సహా ఆటగాళ్లందరూ 14 టెస్టులు చేయించుకున్నారని, అతడికి కూడా నెగటివే వచ్చిందని తెలిపారు. కాబట్టి బబుల్‌లో భాగం కావాలని ప్రతి ఒక్కరినీ అడగలేమన్నారు. వారు క్రమం తప్పకుండా టెస్టులు చేయించుకుంటున్నారని విశ్వనాథన్ వివరించారు.  

 

Updated Date - 2020-10-01T23:47:07+05:30 IST