Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రవాసులకు Kuwait శుభవార్త.. ఆ శాఖలోని ఉద్యోగాల భర్తీలో Ban ఎత్తివేత!

కువైత్ సిటీ: ప్రవాసులకు కువైత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆరోగ్యశాఖలోని ఉద్యోగాల భర్తీలో వలసదారులపై ఇన్నాళ్లు కొనసాగిన బ్యాన్‌ను తొలగించింది. ఈ మేరకు సివిల్ సర్వీస్ కమిషన్(సీఎస్‌సీ) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ శాఖలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఖాళీ కాబోతున్న 214 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నుంచే దీన్ని అమలు చేస్తున్నట్లు సీఎస్‌సీ వెల్లడించింది. ఈ 214 ఉద్యోగాల్లో 57 డాక్టర్లు, 131 నర్సింగ్ స్టాఫ్, 23 టెక్నిషియన్, మూడు ఫార్మాసిస్ట్ పోస్టులు ఉన్నట్లు పేర్కొంది. సీఎస్‌సీ నిర్ణయం పట్ల వలసదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వార్షిక సెలవు దినాల సమతుల్యతకు వ్యతిరేకంగా ఈ స్థానాల్లో ఉన్న అవుట్‌గోయింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసం పేర్కొన్న చట్టపరమైన వ్యవధి పూర్తయ్యే వరకు ఈ జాబ్ స్లాట్‌లను నింపకుండా ఉండాలని సీఎస్‌సీ గతంలో మంత్రిత్వ శాఖకు సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2021/2022 ఆర్థిక సంవత్సరంలో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయని సీఎస్‌సీ తన లేఖలో ధృవీకరించింది.    

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement