వర్షాలపై సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌

ABN , First Publish Date - 2021-08-30T23:52:56+05:30 IST

రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలపై వీడియో

వర్షాలపై సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలపై సీఎస్‌ సోమేష్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డీజీపీ, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ సమీక్ష చేశారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎస్‌ ఆదేశించారు. ఉత్తర తెలంగాణలో అధికారులు సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. నీటిపారుదల, విద్యుత్‌ శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్‌ ఆదేశించారు. 


Updated Date - 2021-08-30T23:52:56+05:30 IST