తెలంగాణలో ప్రధాన మంత్రి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు: సీఎస్

ABN , First Publish Date - 2022-02-03T20:47:14+05:30 IST

ప్రధాన మంత్రతి నరేంద్రద మోదీ ఈ నెల 5 తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు.

తెలంగాణలో ప్రధాన మంత్రి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు: సీఎస్

హైదరాబాద్: ప్రధాన మంత్రతి నరేంద్రద మోదీ ఈ నెల 5 తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన ముచ్చింతల్, ఇక్రిసాట్ లలో జరిగే కార్యక్రకమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పీఎం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. పర్యటన ఏర్పాట్లకు సంబంధించి గురువారం వివిధ శాఖల అధికారులతో ఆయన  సమన్వయ సమావేశం బీఆర్కే భవన్ లో నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయడంతోపాటు,ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని సంబంధిత శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ప్రధాని పాల్గొనే వేదికల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లతోపాటు, ట్రాఫిక్‌ నియంత్రణ, బందోబస్త్ ను  బ్లూ బుక్‌ ప్రకారం ఏర్పాటు చేయాలని ఆయన పోలీసు శాఖను ఆదేశించారు. 


వేదికల వద్ద తగు వైద్య శిభిరాలతోపాటు, నిపుణులైన వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించారు. వీవీఐపీ సందర్శన సమయంలో కోవిడ్-19 ప్రోటోకాల్‌ పాటించేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆయన ఆదేశించారు. వీవీఐపీ పాస్ హోల్డర్లకు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్‌కు ముందే ఆర్టీపీసీఆర్ పరీక్షలను చేపట్టాలని, కోవిడ్-19  స్క్రీనింగ్ బృందాలను పెద్ద సంఖ్యలో నియమించాలని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కాన్వాయ్ ప్రయాణించే రహదారుల మరమ్మతు పనులు చేపట్టాలని, తగినంత లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆర్అండ్ బీ శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. 


వీవీఐపీలు సందర్శించే అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయం, ఇతర వేదికల వద్ద ఏర్పాట్లను కార్యక్రమాల నిర్వాహకులతో సమన్వయం చేయాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.ఈ సమావేశంలో డీజిపిమహేందర్ రెడ్డి, ఇంధన, హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ , జిఏడి ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శ ఎస్.ఏ.ఎం రిజ్వీ, రవాణా, రోడ్డు, భవనాల శాఖ కార్యదర్శి  శ్రీనివాసరాజు, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వి.ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-03T20:47:14+05:30 IST