ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డుల జారీ- సీఎస్ సోమేశ్ కుమార్

ABN , First Publish Date - 2021-12-24T00:17:04+05:30 IST

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు అందచేయడంతో పాటు ఆధార్ కార్డులను వ్యక్తిగత మొబైల్ నెంబర్ లకు అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.

ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డుల జారీ- సీఎస్ సోమేశ్ కుమార్

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ఆధార్ కార్డులను అందచేయడంతో పాటు ఆధార్ కార్డులను వ్యక్తిగత మొబైల్ నెంబర్ లకు అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఆధార్ కార్డుల జారీ, ఆధార్ కార్డులకు మొబైల్ నెంబర్ల అనుసందానం పై గురువారం బీఆర్కె భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ,రాష్ట్రంలో ప్రతి ఏటా ఆరు లక్షల మంది జన్మిస్తున్నారని వీరందరికీ వెంటనే ఆధార్ కార్డులను జనరేట్ చేయాలని అన్నారు. రాష్ట్రంలో 0-5  సంవత్సరాల మధ్య వయస్సుగల వారందరికీ ఆధార్ జనరేట్ చేసేందుకు చర్యలు చేపట్టాలని విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.


రాష్ట్రంలో ఇప్పటికీ ఆధార్ సీడింగ్ కేంద్రాలు లేని మండలాలన్నింటిలో ఆధార్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శిని సీఎస్ ఆదేశించారు.ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్త, పంచాయితీ రాజ్ కార్యదర్శి సందీప్ సుల్తానియా, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి, సివిల్ సప్లై కమిషనర్ అనీల్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి డీ. దివ్య,యుడై(యుఐడిఏ) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం డీడీజి సంగీత తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-24T00:17:04+05:30 IST