ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు ప్రత్యేక మొబైల్ యాప్: సీఎస్

ABN , First Publish Date - 2022-04-28T22:49:15+05:30 IST

రాష్ట్రంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేపట్టే రైతులకు మరింత విస్తృత సమాచారం అందించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సోమేశ్ కుమార్ తెలిపారు

ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు ప్రత్యేక మొబైల్ యాప్: సీఎస్

హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేపట్టే రైతులకు మరింత విస్తృత సమాచారం అందించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐదులక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ను చేపట్టాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన లక్ష్యం పై నేడు ఆర్థిక, వ్యవసాయ, పరిశ్రమలు, ఉద్యానవనశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు , పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆయిల్ ఫెడ్  మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్  అఖీల్,ఉద్యానవన శాఖ సంచాలకులు వెంకట్రామ్ రెడ్డి లు పాల్గొన్నారు. 


ఈ సందర్బంగా సీఎస్  సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రైతులకు 4 నుండి 5 రేట్లు లాభసాటిగా ఉండే ఆయిల్ పామ్ తోటలను 20 లక్షల ఎకారాల్లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆయిల్ పామ్ పెంపకానికి  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలను బడ్జెట్ లో ప్రత్యేకంగా కేటాయించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరంలో 1 ,85,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలను చేపట్టేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ తోటలను పెంచేందుకు భూములు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.

Updated Date - 2022-04-28T22:49:15+05:30 IST