స్వాతంత్య్ర దినోత్సవ వేడులకు భారీ ఏర్పాట్లు- సోమేశ్‌ కుమార్‌

ABN , First Publish Date - 2021-08-09T21:09:40+05:30 IST

ఈనెల 15న జరిగే భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడులకు భారీ ఏర్పాట్లు- సోమేశ్‌ కుమార్‌

హైదరాబాద్‌: ఈనెల 15న జరిగే భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఉదయం 10.30గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని తెలిపారు. సోమవారం వివిధ శాఖల అదికారులతో సీఎస్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేడుకలకు పోలీసుశాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను నియంత్రించాలన్నారు. 


ఈ ఉత్సవాలకు అవసరమైన సదుపాయాలను రోడ్డు, భవనాల శాఖ పర్యవేక్షించాలని చెప్పారు. ఆరోగ్యశాఖ తరపున ఉత్సవాలకు తరలి వచ్చే వారికి మాస్క్‌లు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఇక సాంస్కృతిక శాఖ వేడుకల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనుందని సీఎస్‌ తెలిపారు. ఈ సమావేశంలో స్సెషల్‌ చీఫ్‌సెక్రటరీ సునీల్‌శర్మ, అడిషనల్‌ డిజి జితేందర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌, జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వికాస్‌ రాజ్‌, విద్యుత్‌శాఖ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, గవర్నర్‌ సెక్రటరీ సురేంద్ర మోహన్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-09T21:09:40+05:30 IST