వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలి: సీఎస్‌

ABN , First Publish Date - 2021-08-07T20:57:08+05:30 IST

తెలంగాణలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలి: సీఎస్‌

హైదరాబాద్‌: తెలంగాణలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. శనివారం బిఆర్‌కె భవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎస్‌ మాట్లాడారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీవెంటనే భర్తీచేయాలని, ఆస్పత్రుల్లో ఆక్సీజన్‌ ప్లాంట్‌లను ఏర్పాటుచేయడం, కొన్నిఆస్పత్రుల్లో అదనపు ఫ్లోర్‌ల నిర్మాణం, జిల్లా ఆస్పత్రుల్లో ఇలాపీడియాట్రిక్‌ ఆక్సీజన్‌ప్లాంట్‌లు, ఐసియూ బెడ్స్‌ను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. 


జీహెచ్‌ఎంసి పరిధిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మళ్లీ ముమ్మరం చేయాలనికి దీని కోసం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, పబ్లిక్‌హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు, డైరెక్టర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ రమేశ్‌ రెడ్డి, టిమ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖరరెడ్డి, టీఎస్‌ఐఐసి చీఫ్‌ ఇంజనర్‌ శ్యామ్‌సుందర్‌, టీ ఎస్‌ఎంఐడిసి సీఈ రాజేందర్‌ తదితరులుపాల్గొన్నారు. 

Updated Date - 2021-08-07T20:57:08+05:30 IST