సమీకృత మార్కెట్ల నిర్మాణం కోసం 500 కోట్లు: సీఎస్ సోమేశ్ కుమార్

ABN , First Publish Date - 2021-06-14T22:34:33+05:30 IST

రాష్ట్రంలో సమీకృత మార్కెట్ల నిర్మాణం కోసం ఈ బడ్జెట్‌లో 500 కోట్ల

సమీకృత మార్కెట్ల నిర్మాణం కోసం 500 కోట్లు: సీఎస్ సోమేశ్ కుమార్

సిద్దిపేట: రాష్ట్రంలో సమీకృత మార్కెట్ల నిర్మాణం కోసం ఈ బడ్జెట్‌లో 500 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ముట్రాజ్‌పల్లి R & R కాలనీని, గజ్వేల్ సమీకృత మోడల్ మార్కెట్‌ను జిల్లా కలెక్టర్ వెంకట్రాం రెడ్డితో కలిసి సీఎస్ సోమేష్ కుమార్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గజ్వేల్‌ సమీకృత మార్కెట్ చాలా బాగుందన్నారు. గజ్వేల్‌లో నిర్మించిన సమీకృత కూరగాయల మార్కెట్‌ను రోల్ మోడల్‌గా తీసుకొని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో సమీకృత మార్కెట్లను నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. 


మంచి వాతావరణంలో వెలుతురు ,గాలి వచ్చేలా దుర్వాసనకు ఆస్కారం లేకుండా గజ్వేల్‌ సమీకృత మార్కెట్‌ను నిర్మించారన్నారు. అనంతరం విక్రేతలు, వినియోగదారులతో సీఎస్ మాట్లాడారు. సమీకృత మోడల్ మార్కెట్ ఇరువురికి సౌలభ్యంగా ఉందని విక్రేతలు, వినియోగదారులు తెలిపారు. మీ స్పందన చూస్తే చాలా సంతోషంగా ఉందని సీఎస్ సోమేష్ కుమార్ అన్నారు. 

Updated Date - 2021-06-14T22:34:33+05:30 IST