పదవీ విరమణ పొందిన అధికారులను సత్కరించిన సీఎస్ సోమేశ్ కుమార్

ABN , First Publish Date - 2021-02-28T00:17:52+05:30 IST

సచివాలయంలో వివిధశాఖలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన నలుగురు అధికారులకు బిఆర్ కెఆర్ భవన్ లో జీఏడీ

పదవీ విరమణ పొందిన అధికారులను సత్కరించిన సీఎస్ సోమేశ్ కుమార్

హైదరాబాద్: సచివాలయంలో వివిధశాఖలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన నలుగురు అధికారులకు బిఆర్ కెఆర్ భవన్ లో జీఏడీ, తెలంగాణ  సచివాలయ ఉదోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షత వహించారు. పదవీ విరమణ పొందిన అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ సత్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన అధికారుల పని తీరును వారు అందించిన సేవలను కొనియాడారు. ఆ అధికారులు సంతోషంగా, శేష జీవితంలో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. వారిని గౌరవ ప్రదంగా ప్రభుత్వ వాహనంలో వారి ఇంటికి సాగనంపాలని అధికారులను ఆదేశించారు. ఇకముందు జరగబోయే పదవీ విరమణ సన్మాన సభలను ఘనంగా, సమన్వయంతో నిర్వహించాలని కోరారు.


సచివాలయంలో ఆయా విభాగాలలో పని చేస్తున్న ఐ అండ్ సీఏడి శాఖ సహాయ కార్యదర్శి శ్రీదేవి, పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్ మెంట్ శాఖ సెక్షన్ ఆఫీసర్ బి.ఎన్.ఎస్.వి. ప్రసాద్ , రోడ్డు, భవనాల శాఖ కార్యదర్శి కార్యాలయంలో పనిచేస్తున్న పర్సనల్ సెక్రటరీ కె.ఉమారాణి, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ గ్రేడ్-2 సెక్షన్ అసిస్టెంట్ కిషన్ లాల్ లు ఈ రోజు పదవీ విరమణ  పొందిన వారిలో ఉన్నారు. ఈ సమావేశంలో రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ , జిఏడి ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, గ్రామీణాభివృద్ధి ,పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా , వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రొటోకాల్ విభాగం అదనపు కార్యదర్శి అర్విందర్ సింగ్, అడిషనల్ సెక్రటరీ నరెందర్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T00:17:52+05:30 IST