పాపం ఏపీ సీఎస్.. ఆమే బాస్ అయినా..!

ABN , First Publish Date - 2020-02-23T08:56:19+05:30 IST

తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పటి సంగతి! తమ కార్యాలయం నుంచి డేటా దొంగలించారని టీడీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రభుత్వం ‘సిట్‌’ వేసింది. ఇది... నేర వ్యవహారం కాబట్టి హోంశాఖ ముఖ్య కార్యదర్శి జీవో...

పాపం ఏపీ సీఎస్.. ఆమే బాస్ అయినా..!

  • యంత్రాంగానికి బాస్‌.. అయినా అధికారాలకు కత్తెర 
  • ఆమె ప్రమేయం లేకుండానే..
  • అతి కీలక ఉత్తర్వులు జారీ
  • చంద్రబాబు పాలనపై ‘సిట్‌’ జీవో 
  • జీఏడీ ముఖ్యకార్యదర్శి పేరిట విడుదల 
  • ఉత్తర్వుల్లో లేని నీలం సాహ్ని ప్రస్తావన 
  • కనీస మర్యాద పాటించలేదంటున్న అధికార వర్గాలు


(అమరావతి - ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పటి సంగతి! తమ కార్యాలయం నుంచి డేటా దొంగలించారని టీడీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రభుత్వం ‘సిట్‌’ వేసింది. ఇది... నేర వ్యవహారం కాబట్టి హోంశాఖ ముఖ్య కార్యదర్శి జీవో జారీ చేశారు! ఎర్రచందనం కూలీలపై కాల్పుల ఘటన పెను సంచలనం సృష్టించింది. ఇది అటవీ, పోలీసు శాఖలకు సంబంధించిన అంశం! దీంతో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘సిట్‌’ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ భూబాగోతం... రెవెన్యూ, పోలీసు శాఖలతో ముడిపడిన వ్యవహారం. దీనిపైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘సిట్‌’ ఉత్తర్వులు జారీ చేశారు! 


అంటే... ఒకటికి మించిన శాఖలకు సంబంధించిన అంశాలు, ఆ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాల్సిన ఉత్తర్వులను జారీచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్‌స)కే ఉంటుంది. బిజినెస్‌ రూల్స్‌ స్పష్టంగా చెబుతున్నది ఇదే! మొత్తం అధికార యాంత్రాంగానికి బాస్‌ సీఎస్‌! కానీ... ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీకి తెలియకుండానే, ఆమె ప్రమేయం లేకుండానే అతి కీలకమైన ఉత్తర్వులు జారీ అయిపోతున్నాయి. చంద్రబాబు హయాంలో జరిగిన నిర్ణయాలపై ‘సిట్‌’ ఏ ర్పాటు చేస్తున్నట్లు జీఏడీ ముఖ్య కార్యదర్శి(పొలిటికల్‌) ప్రవీణ్‌ ప్రకాశ్‌ పేరిట జీవో జారీ అయ్యింది. ఇది 50కి పైగా విభాగాలతో ముడిపడిన విషయం.


ఇద్దరు ముఖ్య కార్యదర్శులు, లేకుంటే ఇద్దరు శాఖాధిపతులు సమాన స్థాయిలో ఉంటే... వారిద్దరి విధులు, సమన్వయం విషయంలో అంతకంటే పైస్థాయి అధికారి మాత్రమే ఉత్తర్వులు జారీ చేయాలి. అంటే... సీఎ్‌సకే ఆ అధికారం ఉం టుంది. కానీ... శుక్రవారం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటుచేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సీఎస్‌ నీలం సహానీ ప్రస్తావ నే లేదు. పైగా... ఈ జీవోలో ఏ అధికారినైనా పిలిపించుకునే అధికారాన్ని సిట్‌కు కట్టబెట్టడం గమనార్హం. ప్రభు త్వ అధినేతగా ముఖ్యమంత్రి ఉంటే... పాలనా యంత్రాంగానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. ఇది ఆచరణలో ఎలాఉన్నా... కనీసం జీవోలైనా సీఎస్‌ పేరు మీద రావడం ఆనవాయితీ. 


జీవో 128నుంచే ప్రేరణ 

ఎల్వీ సుబ్రమణ్యం సీఎ్‌సగా ఉన్నప్పుడు... ఆయన అధికారాలకు కత్తెర వేస్తూ గతంలోనే ఉత్తర్వులు జారీచేశారు. గతేడాది అక్టోబరులో సీఎంవో ముఖ్య కార్యదర్శి పేరుతో దీనిపై జీవో.128 వెలువడింది. గవర్నర్‌ అనుమ తి తీసుకోకుండా, నాటి సీఎ్‌సకు సమాచారం ఇవ్వకుండా నే బిజినెస్‌ రూల్స్‌ను సవరించారు.


పరిపాలనా యం త్రాంగం ఎలా నడవాలన్న విషయంపై రాజ్యాంగంలోని 166వ అధికరణంలో స్పష్టంగా చెప్పారు. దాని ప్రకారమే రాష్ట్రాలు బిజినెస్‌ రూల్స్‌ రూపొందించుకుంటాయి. పాలనా యంత్రాంగం ఎలా నడవాలి? అధికారాల బదలాయింపు ఎలా ఉండాలి? అధికార క్రమం ఏంటి? తదితర అంశాలతో కూడినవే బిజినెస్‌ రూల్స్‌! ఒకరి అధికారాల్లోకి మరొకరు ప్రవేశించకుండా ఈ ఏర్పాటు చేస్తారు. 


ఫైళ్ల కదలిక ఇలా.... 

ముఖ్యమైన ఫైళ్లు ప్రాముఖ్యాన్ని బట్టి కొన్ని శాఖాధిపతులకు, కొన్ని కార్యదర్శులకు, కొన్ని సీఎస్‌ దగ్గరకు, మరికొన్ని సీఎం వరకు కూడా వెళ్తుంటాయి. అతి ముఖ్యమైన ఫైళ్లు మాత్రం సీఎస్‌ దగ్గరకు... ఆయన దగ్గరినుంచి సీఎంకు వెళ్తాయి. అదేవిధంగా ముఖ్యమైన ఆదేశాలు, ప లు శాఖలకు ఉమ్మడిగా సంబంధించిన అంశాలపై ఉత్తర్వులు సీఎస్‌ జారీ చేస్తారు.


ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు అనుభవంలో సీనియర్లు అయినప్పటికీ ఉత్తర్వుల జారీ మాత్రం సీఎస్‌ పేరు మీదే చేస్తారు. అయితే ఆ అవసరం కూడా లేకుండా ప్రవీణ్‌ ప్రకాశ్‌ బిజినెస్‌ రూల్స్‌కు సవరణలు చేశారు. జీవో 128తో పాటు మరికొన్ని అంశాల్లో విభేదించిన నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి ఎల్వీ సుబ్రమణ్యం తన సెలవును మరో నెల పొడిగించుకున్నారు. గత నవంబరులో బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించిన నాటినుంచీ ఆయన సెలవులోనే ఉన్నారు. 


Updated Date - 2020-02-23T08:56:19+05:30 IST