వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులో సీఎస్ సమావేశం

ABN , First Publish Date - 2021-12-17T23:34:25+05:30 IST

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, ప్రమాదాల్లో మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.

వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులో సీఎస్ సమావేశం

హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, ప్రమాదాల్లో మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం తన చాంబర్ లోవివిధ శాఖలకు సంబంధించి వరల్డ్ బ్యాంక్ అధికారులతో సమావేశమయ్యారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు బాగా తగ్గాయని సీఎస్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ పై రవాణాశాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా పలు కార్యక్రమాలు తీసుకుంటున్నారని అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహనా కల్పిస్తున్నారని తెలిపారు.


రోడ్లపై ప్రయాణించే సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై డ్రైవర్లకు, పాదచారులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రభుత్వం కొన్ని యాప్ లను తయారు చేస్తోందన్నారు. రోడ్లపై ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి పటిష్టంగా మానిటర్ చేస్తున్నదని చెప్పారు.రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు వెంటనే వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. రోడ్స్, రవాణా, పోలీస్, హెల్త్ డిపార్ట్ మెంట్ లు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. తద్వారా రోడ్డు ప్రమాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. 


రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్ల ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వరల్డ్ బ్యాంక్ టీమ్ తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. రోడ్డు ఇంజనీరింగ్, వాహనాల సేఫ్టీ, డ్రైవర్ ట్రెయినింగ్, ఎన్ఫోర్స్మెంట్, పోస్ట్ క్రాష్ కేర్ తదితర కార్యక్రమాల గురించి వరల్డ్ బ్యాంక్ టీమ్ వివరించింది. దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాలకు 6725 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్టు వివరించారు. ఈ మేరకు తెలంగాణకు 320 కోట్లు రోడ్డు భద్రతా కార్యక్రమాలకు కేటాయిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ సమావేశంలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు అర్ణబ్ బందోపాధ్యాయ, వెంకట్ రావు, విజేత బెజ్జం, క్రిష్ణన్, రజత్ భూషణ్, అతిథి గుప్త, ఆస్థాఅరోరా తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-17T23:34:25+05:30 IST