హైదరాబాద్: రూ.58 కోట్ల కేటాయింపుపై హైకోర్టుకు సీఎస్ వివరణ

ABN , First Publish Date - 2021-08-05T19:33:38+05:30 IST

కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ. 58 కోట్ల కేటాయింపుపై హైకోర్టుకు సీఎస్ వివరణ ఇచ్చారు.

హైదరాబాద్: రూ.58 కోట్ల కేటాయింపుపై హైకోర్టుకు సీఎస్ వివరణ

హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ. 58 కోట్ల కేటాయింపుపై హైకోర్టుకు సీఎస్ సోమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. ఆ రూ. 58 కోట్లు తనపై కోర్టు ధిక్కరణ కేసుల కోసం కాదని అన్నారు. భూసేకరణ పరిహారం చెల్లింపు కేసుల్లో కోర్టు ధిక్కరణ కేసుల కోసమేనని ఏజీ తెలిపారు. పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించారని సీఎస్ సోమేష్‌కుమార్ తెలిపారు. విచారణ సందర్భంగా వాస్తవాలు కోర్టు ముందుంచలేకపోయామని సీఎస్ అన్నారు. నిధులు విడుదల చేయొద్దన్న ఆదేశాలు ఉపసంహరించాలని ఆయన హైకోర్టును కోరారు. ఈ పిల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని ఏజీ బీఎస్ ప్రసాద్ న్యాయస్థానాన్ని కోరారు.


ఇదిలా ఉండగా జీవో రాసిన తీరుపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు ఆ జీవో తయారు చేసిన ఉద్దేశం ఏంటి? కాగితంపై రాసిందేంటి? అని న్యాయస్థానం ప్రశ్నించింది. జీవోను పరిశీలిస్తే కోర్టు ధిక్కరణ కేసుల ఖర్చుల కోసమేనన్న విధంగా జీవో ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. జీవో విడుదల చేసే ముందు ఎలా రాశారో న్యాయశాఖ చూడాలి కదా? అని హైకోర్టు పేర్కొంటూ... తదుపరి విచారణ సోమవారం నాటికి వాయిదా వేసింది.

Updated Date - 2021-08-05T19:33:38+05:30 IST