క్రిప్టో లాభాలపై పన్ను!

ABN , First Publish Date - 2021-11-20T06:20:34+05:30 IST

క్రిప్టోకరెన్సీలను ఆదాయ పన్ను చట్టం పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటీవలి కాలంలో క్రిప్టోకరెన్సీ లావాదేవీలు అనూహ్యంగా పెరిగిపోవటంతో పాటు....

క్రిప్టో లాభాలపై పన్ను!

ఆదాయ పన్ను చట్టంలో మార్పులు

బడ్జెట్‌లో ప్రకటించనున్న ప్రభుత్వం 


న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలను ఆదాయ పన్ను చట్టం పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటీవలి కాలంలో క్రిప్టోకరెన్సీ లావాదేవీలు అనూహ్యంగా పెరిగిపోవటంతో పాటు ఇందులో పెట్టుబడులు పెట్టిన వారు పెద్ద ఎత్తున లాభాలు ఆర్జిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే క్రిప్టో లాభాలపై పన్ను వసూలు చేసేందుకు గాను ఆదాయ పన్ను చట్టంలో కొన్ని మార్పులు చేర్పు లు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ వెల్లడించారు. ఇందుకోసం వచ్చే బడ్జెట్‌లో ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలో కొన్ని మార్పులు చేయాలని యోచిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే కొంతమంది క్రిప్టోకరెన్సీ నుంచి లాభాలను ఆర్జిస్తే దానిపై క్యాపిటల్‌ గెయిన్స్‌ టాక్స్‌ను చెల్లిస్తున్నారని బజాజ్‌ తెలిపారు. అలాగే క్రిప్టో లావాదేవీలకు సంబంధించి జీఎ్‌సటీ వసూలు చేసే విష యం చాలా స్పష్టంగా ఉందన్నారు.


క్రిప్టో లాభాలపై ఇప్పటికే పన్ను చెల్లిస్తున్న వారిని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు బజాజ్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆదాయ పన్ను చట్టంలో ఏమైనా మార్పులు చేయాలా వద్దా అనే అంశంపై చర్చించి, వచ్చే బడ్జెట్‌లో అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా క్రిప్టో ట్రేడింగ్‌ సమయంలోనే మూలంలోనే పన్ను వసూలు (టీసీఎస్‌) చేసే విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో క్రిప్టోకరెన్సీ వినియోగంపై ఎలాంటి ఆంక్షలు, నిషేధం లేవు.  

Updated Date - 2021-11-20T06:20:34+05:30 IST