‘క్రిప్టో స్ట్రీకర్‌’ కలకలం

ABN , First Publish Date - 2021-06-23T09:29:00+05:30 IST

యూరో కప్‌లో బెల్జియం-ఫిన్లాండ్‌ మధ్య మ్యాచ్‌ సందర్భంగా అనూహ్య ఘటన చోటు చేసుకొంది.

‘క్రిప్టో స్ట్రీకర్‌’  కలకలం

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌: యూరో కప్‌లో  బెల్జియం-ఫిన్లాండ్‌ మధ్య మ్యాచ్‌ సందర్భంగా అనూహ్య ఘటన చోటు చేసుకొంది. మ్యాచ్‌ జరిగే సమయంలో ఓ లేడీ స్ట్రీకర్‌.. సెక్యూరిటీ కళ్లుగప్పి ఫీల్డ్‌లోకి పరిగెత్తుకుంటూ రావడం కలకలం సృష్టించింది. క్రిప్టో కరెన్సీకి ప్రచారం చేయడం కోసమే ఆ అమ్మాయి ఫెన్సింగ్‌ దూకి వచ్చినట్టు భావిస్తున్నారు. ‘డబ్ల్యూటీఎఫ్‌ కాయిన్‌’ అని ఆమె టీషర్ట్‌పై రాసి ఉంది. ఇది బిట్‌కాయిన్‌కు ప్రత్యర్థి కంపెనీ. దాదాపుగా పిచ్‌ మధ్య భాగం వరకు పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ అమ్మాయిని సెక్యూరిటీ వారు పట్టుకొని బయటకు పంపేశారు. 

Updated Date - 2021-06-23T09:29:00+05:30 IST