ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు, బిట్ కాయిన్ సహా క్రిప్టో భారీ జంప్

ABN , First Publish Date - 2021-07-22T23:47:40+05:30 IST

బిట్ కాయిన్ ఈ రోజు 32 వేల డాలర్లను అధిగమించింది. ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా పరుగులు పెట్టాయి. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం కావడం గమనార్హం.

ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు, బిట్ కాయిన్ సహా క్రిప్టో భారీ జంప్

న్యూయార్క్ : బిట్ కాయిన్ ఈ రోజు 32 వేల డాలర్లను అధిగమించింది. ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా పరుగులు పెట్టాయి. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం కావడం గమనార్హం. గతంలో ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ... క్రిప్టో బిట్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే పర్యావరణ అంశానికి సంబంధించి ఆ తర్వాత మస్క్ చేసిన వ్యాఖ్యలకు తోడు చైనా, టర్కీ తదితర దేశాల నిర్ణయాలు క్రిప్టో కరెన్సీ పై పెను ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో... క్రిప్టో కరెన్సీ దారుణంగా పతనమైంది. ఇక ఆల్ టైమ్ గరిష్టం 65 వేల డాలర్లకు చేరుకున్న బిట్ కాయిన్ అయితే ఇటీవల 29 వేల డాలర్లకు పడిపోయింది. ఇప్పుడు మళ్లీ మస్క్ వ్యాఖ్యలు ప్రభావం చూపాయి. 


ఎలాన్ మస్క్ ఏమన్నారంటే... 

టెస్లా కొనుగోలు చేసిన బిట్ కాయిన్స్ సహా క్రిప్టో కరెన్సీని విక్రయిస్తారని ఇన్వెస్టర్లు భావించారు. కానీ తాజాగా ఎలాన్ మస్క్ మాట్లాడుతూ ‘స్పెసెక్స్ వద్ద కూడా డిజిటల్ టోకెన్స్ ఉన్నాయి, వీటిని విక్రయించే ఆలోచన లేదు’ అని పేర్కొన్నారు. బిట్‌కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టో కరెన్సీలు ఎథేర్, డోజీకాయన్ కూడా లాభపడ్డాయి. తన వద్ద స్వయంగా మూడు డిజిటల్ టోకెన్స్ ఉన్నాయని టెస్లా అధినేత తెలిపారు. ఇటీవల 30 వేల డాలర్ల దిగువకు పడిపోయిన బిట్ కాయిన్ మస్క్ వ్యాఖ్యలతో ఇప్పుడు 32 వేల డాలర్లను దాటింది. ఆయన వ్యాఖ్యల నేపధ్యంలో బిట్ కాయిన్ 32,012.09 డాలర్ల వద్ద ట్రేడ్ కాగా, ఎథేర్ 1,984.69 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 0.192449 డాలర్ల వద్ద, లైట్ కాయిన్ 118.26 డాలర్ల వద్ద, ఎక్స్‌ఆర్‌పీ 0.585495 డాలర్ల వద్ద, కార్డానో 1.17 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. బిట్ కాయిన్, ఎథేర్, డోజీకాయిన్ గత 24 గంటల్లో 4-6 శాతం పెరిగాయి.


1.3 ట్రిలియన్ డాలర్లు పతనం... బిట్ కాయిన్ గత రెండు సెషన్లుగా 30 వేల డాలర్ల దిగువన ట్రేడ్ అయింది. మే నెల నుండి బిట్ కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.3 ట్రిలియన్ డాలర్ల మేరకు పతనమైంది. ఎలాన్ మస్క్ వ్యాఖ్యల ప్రభావం క్రిప్టో పైన తారస్థాయిలోనే ఉంది. దీంతో పాటు చైనా, యూరప్, అమెరికా దేశాల రెగ్యులేషన్స్ ప్రభావం కూడా ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 

Updated Date - 2021-07-22T23:47:40+05:30 IST