సీఆర్‌పీఎఫ్‌ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-03-01T06:30:49+05:30 IST

ఆదివాసీలు సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాళ్లగెడ్డ 234 బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండర్‌ అరుణ్‌ కుమార్‌ అన్నారు

సీఆర్‌పీఎఫ్‌ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
క్రీడాకారులకు కిట్‌ను అందజేస్తున్న వైద్యాధికారి సాయి సింధు, ఏసీ అరుణ్‌ కుమార్‌


అసిస్టెంట్‌ కమాండర్‌ అరుణ్‌ కుమార్‌

చింతపల్లి, ఫిబ్రవరి 28: ఆదివాసీలు సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాళ్లగెడ్డ 234 బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండర్‌ అరుణ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన నిమ్మపాడులో సివిక్‌ యాక్షన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు కుటుంబ సభ్యులు, స్వగ్రామాలను విడిచి ఆదివాసీల భద్రత కోసం 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ యువతకు క్రికెట్‌, వాలీబాల్‌ కిట్లు, ఆదివాసీలకు రేడియో, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన వైద్యశిబిరంలో సీఆర్‌పీఎఫ్‌ వైద్యాధికారి సాయి సింధు వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పి.ముర్ముర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-01T06:30:49+05:30 IST