Advertisement
Advertisement
Abn logo
Advertisement

కోట మహిషాసురమర్దినికి రూ.17.5 లక్షల విలువైన బంగారు కిరీటం

నూజివీడు టౌన్‌, అక్టోబరు 14: నూజివీడు కోట మహిషాసురమర్దిని అమ్మవారికి విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బంగారు కిరీటాన్ని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు చిన్నం రామకోటయ్య తయారు చేయించారు. రూ.17 లక్షల 50 వేలతో 345 గ్రాముల బంగారంతో ఈ కిరీటాన్ని తయారు చేయించినట్లు ఆయన చెప్పారు. విజయదశమి రోజున అమ్మవారికి బహూకరిస్తామని రామకోటయ్య దంపతులు తెలిపారు. 


Advertisement
Advertisement