వేములవాడలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-10-26T06:00:28+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి రాజన్న ఆలయానికి ఆదివారం రాత్రి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

వేములవాడలో భక్తుల రద్దీ
రాజన్న ఆలయంలో కిక్కిరిసిన భక్తులు

వేములవాడ టౌన్‌, అక్టోబరు 25: వేములవాడ  రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది.  వివిధ ప్రాంతాల నుంచి రాజన్న ఆలయానికి ఆదివారం రాత్రి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సోమవారం తెల్లవారు జామున భక్తులు తలనీలాలు సమర్పించి ధర్మదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్‌లో ఆలయంలోకి ప్రవేశించారు.  స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడెమెక్కు చెల్లించుకున్నారు. పార్వతీపరమేశ్వరులను దర్శించుకొని తరించారు.   భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ నేతృత్వలో ఆలయ ఏఈవో ప్రతాప నవీన్‌, పర్యవేక్షకుడు శ్రీరాములు, పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

రాజన్నను దర్శించుకున్న ప్రముఖులు 

వేములవాడ  రాజరాజేశ్వరస్వామిని తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌  కార్పొరేషన్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి. చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు నాగిరెడ్డి మండపంలో  ఆశీర్వదించారు.  ఆలయ పీర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్‌ స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. రాష్ట్ర టీబీ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ ఆడెపు రాజేశం దంపతులు స్వామి వారిని దర్శించుకున్నారు. 

Updated Date - 2021-10-26T06:00:28+05:30 IST