బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-12-08T05:56:10+05:30 IST

కోరిన కోరికలు తీర్చే తల్లి వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం మంగళవారం బోనాలు సమర్పించే భక్తులతో జాతరను తలపించింది.

బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
బోనాలతో బారులు తీరిన భక్తులు

 వేములవాడ, డిసెంబరు 7 : కోరిన కోరికలు తీర్చే తల్లి వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం మంగళవారం బోనాలు సమర్పించే భక్తులతో జాతరను తలపించింది. సోమవారం శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మంగళవారం భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకుని తరించారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో బోనం మొక్కు చెల్లించేందుకు భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. 

 గోశాలలకు రాజన్న కోడెలు

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం గోశాలకు చెందిన వంద కోడెలను మంగళవారం ప్రైవేటు స్వచ్ఛంద సంస్థల గోశాలలకు అప్పగించారు. వర్ధన్నపేటలోని భారత్‌ గోశాల, కొలన్‌పల్లిలోని వినాయక గోశా ల, రామవరంలోని వేంకటేశ్వర గోశాల, విశ్వంతపురంలోని శివలింగ గోశాల, లాల్‌మా తండాలోని పోతన్న గోశాలకు 20 కోడెల చొప్పున ఆలయ గోశాల సూపరింటెండెంట్‌ హరిహరనాథ్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఎల్‌.రాజేందర్‌, జీ.శంకర్‌, ప్రైవేటు గోశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:56:10+05:30 IST