క్కిరిస్తున్న సేవలు!

ABN , First Publish Date - 2022-04-27T06:56:14+05:30 IST

జిల్లాలోని పీహెచ్‌సీల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. వైద్యులు తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల అనుకున్నవిధంగా సేవలు అందడం లేదు. కొన్ని ఆసుపత్రులకు ఇన్‌చార్జిలను నియమించడం వల్ల పూర్తిస్థాయిలో సేవలను అందించడం వీలు కావడంలేదు. పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న

క్కిరిస్తున్న సేవలు!

జిల్లాలోని పలు పీహెచ్‌సీలలో వైద్య పోస్టుల ఖాళీలు

ఆసుపత్రుల్లోమౌలిక వసతులు ఉన్నా.. అంతంతే అందుతున్న వైద్య సేవలు 

ఇంకా భర్తీ కాని వైద్యుల ఖాళీలు, ఇతర సిబ్బంది

ఉన్న వారితోనే వైద్య సేవలు

పదోన్నతులతో ఆసుపత్రుల్లో ఖాళీలు

జిల్లావ్యాప్తంగా మొత్తం 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని పీహెచ్‌సీల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. వైద్యులు తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల అనుకున్నవిధంగా సేవలు అందడం లేదు. కొన్ని ఆసుపత్రులకు ఇన్‌చార్జిలను నియమించడం వల్ల పూర్తిస్థాయిలో సేవలను అందించడం వీలు కావడంలేదు. పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న పీజీ డాక్టర్‌లకు పదోన్నతులు కల్పించి వైద్య విధాన పరిషత్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యూకేషన్‌ పరిధిలోకి బదిలీ చేయడంతో ఖాళీల సంఖ్య పెరిగింది. గ్రామీణ ప్రాంతంలో అవసరమైన మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ల నియామకం గత కొన్నేళ్లుగా చేపట్టకపోవడం వల్ల ఉన్నవారిపైనే పనిభారం పెరిగి ఇబ్బందులు పడుతున్నారు. కరోనా టైంలో కీలకంగా పనిచేసినా.. ఖాళీలను భర్తీ చేయకపోవడం, పదోన్నతులతోఇతర ప్రాంతాలకు బదిలీ కావడం వల్ల చాలా పీహెచ్‌సీల పరిధిలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

శాశ్వత ప్రాతిపదికన 28మంది వైద్యులే..

జిల్లాలో 22 ప్రభుత్వ పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటితో పాటు పది అర్బన్‌ పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటి పరిధిలోనే జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వైద్య సేవలను అందిస్తున్నారు. ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఇవేకాకుండ సీహెచ్‌సీ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. వీటి పరిధిలో అన్ని రకాల వైద్యులు సేవలు అందిస్తున్నారు. జిల్లాలోని ఈ ఆసుపత్రిలో మొత్తం 86 మంది వైద్యులు ఉండాలి. ప్రభుత్వం ఈ పోస్టులకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో 28 మంది వైద్యులు మాత్రమే శాశ్వత ప్రాతిపదికన భర్తీ అయినవారు ఉన్నారు. వీరుకాకుండా కాంట్రాక్ట్‌ వైద్యులు 19 మంది ఉన్నారు. జిల్లాలో అన్ని పీహెచ్‌సీల పరిదిలో ఈ 47 మంది మాత్రమే వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లో 39 వైద్యుల ఖాళీలు ఉన్నాయి. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో గర్భీణులకు అన్నిరకాల సేవలు అందించడంతో పాటు సాధారణ జ్వరాలు, ఇతర వ్యాధులకు ఈ వైద్యుల ఆధ్వర్యంలోనే చికిత్సలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లో మొత్తం వైద్యులు లేకపోవడం వల్ల చాలా ఆసుపత్రుల్లో ఒక వైద్యుడితోనే సేవలు అందిస్తున్నారు. అన్ని పీహెచ్‌సీల్లో ఉదయం 8నుంచి సాయంత్రం 5 గంటల వరకు సేవలు అందించాల్సి ఉన్నా.. కొన్ని ఆసుపత్రుల్లో ఇన్‌చార్జి ్జలు ఉండడం వల్ల ఎక్కువ సమయం వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ఇవేకాకుండా ఇతర సర్వేలకు తిరగడం, టీబీ, మలేరియా, ఇతర వ్యాధులపైన అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 

ఫ హెల్త్‌ అసిస్టెంట్‌ల ఖాళీలు

 జిల్లాలో అన్ని పీహెచ్‌సీల పరిధిలో మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులు కూడా చాలా ఖాళీలు ఉన్నాయి. జిల్లాలో అన్ని పీహెచ్‌సీల పరిధిలో 270 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ల పోస్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం 167 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లో 103 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతీ ఆసుపత్రి పరిధిలో ఒకటి నుంచి రెండు వరకు ఈ హెల్త్‌ అసిస్టెంట్‌ ఖాళీలు ఉండ డం వల్ల గ్రామాల్లో పర్యటించడం, అవసరమైన చర్యలు చేపట్టడానికి ఇబ్బందులు తల్తెత్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్‌ల ద్వారా ఈ పోస్టులన్ని భర్తీ చేయనుండడంతో మరో ఆరు నెలల వరకు ఉన్న వైద్యులు, సిబ్బందితోనే సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అదికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత పోస్టులన్నీ భర్తీ అయ్యే అవకాశం ఉండ డంతో తప్పనిసరి పరిస్థితిలో ఉన్న సిబ్బందితోనే అవసరమైన సేవలు అందిస్తున్నారు. 

ఫ సిబ్బంది భర్తీతోనే మెరుగైన సేవలు

అన్ని పీహెచ్‌సీల్లో మొత్తం సిబ్బందిని నియమించి పరీక్షలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందిస్తే గ్రామీణ ప్రాంతం వారు జిల్లాకేంద్రం వరకు వచ్చి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆశ్రయించే పరిస్థితి తప్పనుంది. వైద్యానికి భారీ ఎత్తున ఖర్చుచేసే పరిస్థితి రాకుండ ఉండే అవకాశం ఉం ది. జిల్లాలో అన్ని పీహెచ్‌సీల పరిధిలో వైద్యులకు పదోన్నతులు వచ్చి వైద్య విధాన పరిషత్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడిక ల్‌ ఎడ్యూకేషన్‌ పరిధిలోకి వెళ్లడం వల్ల ఖాళీలు ఎక్కువగా ఉ న్నాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదికారి డాక్టర్‌ సుదర్శ నం తెలిపారు. ఉన్న సిబ్బందితోనే మెరుగైన సేవలు అం దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.

Updated Date - 2022-04-27T06:56:14+05:30 IST