కిటకిటలాడిన సంత

ABN , First Publish Date - 2022-07-03T04:37:19+05:30 IST

బక్రీద్‌ పండుగ సమీపిస్తుండటంతో మండలంలోని అంగళ్లులో శనివారం నిర్వహించిన గొర్రెల సంత కిటకిటలాడింది.

కిటకిటలాడిన సంత
కిటకిటలాడుతున్న అంగళ్లు గొర్రెల సంత

బక్రీద్‌ ఎఫెక్ట్‌...

కురబలకోట, జూలై 2: బక్రీద్‌ పండుగ సమీపిస్తుండటంతో మండలంలోని అంగళ్లులో శనివారం నిర్వహించిన గొర్రెల సంత కిటకిటలాడింది. బక్రీద్‌ పండుగ ఎఫెక్ట్‌తో సాధార సమయాల్లో కంటే రెట్టింపు స్థాయిలో గొర్రెలు, పొట్టేళ్లు, మేకపోతులు వచ్చాయి. కాగా సంతకు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారే కాకుండా కర్నాటక, తమిళనాడు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో లక్షలాది రూపాయల వ్యాపార లావాదేవీలు జరిగాయి. సాధారణ సమయాల్లో కంటే అధికంగా ధరలు పలికాయి. ఇక్కడ కొనుగోలు చేసిన పొట్టేళ్లు, మేకపోతులను కర్నాటక, తమిళనాడు, కేరళ తదితర ప్రాంతాలకు తరలించారు.

Updated Date - 2022-07-03T04:37:19+05:30 IST