కిక్కిరిసిన రైతుబజార్లు

ABN , First Publish Date - 2021-05-06T05:35:28+05:30 IST

ప్రభుత్వం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపార సముదాయాలు పనిచేయాలని ఆదేశించడంతో బుధవారం రైతుబజార్లలో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది.

కిక్కిరిసిన రైతుబజార్లు
ఎంవీపీ కాలనీ బజారులో కోడిగుడ్ల కోసం క్యూ

కోడిగుడ్లు, కూరగాయలకు డిమాండ్‌

విశాఖపట్నం, మే 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపార సముదాయాలు పనిచేయాలని ఆదేశించడంతో బుధవారం రైతుబజార్లలో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. ప్రభుత్వం విధించింది పాక్షిక లాక్‌డౌన్‌ అయినప్పటికీ కూరగాయలు దొరకవేమోనని, ధరలు పెరిగిపోతాయనే ఆందోళనతో కొనుగోళ్లకు ప్రజలు ఎగబడ్డారు. సీతమ్మధార బజారు కిక్కిరిసిపోయింది. భౌతిక దూరం లేకుండా పోయింది. ఈ సమస్య నివారణకు ఈ బజార్లకు అనుబంధంగా 33 మినీ రైతుబజార్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. జీవీఎంసీ అధికారులు ఆయా ప్రాంతాల్లో టెంట్లు, మంచినీటి వసతి వంటి ఏర్పాట్లు ఇంకా పూర్తిచేయకపోవడంతో చాలాచోట్ల ఇవి ప్రారంభం కాలేదు. దీంతో యథాప్రకారం రైతుబజార్లకు వచ్చేశారు. ఎంవీపీ రైతుబజారులో కోడిగుడ్ల కోసం బారులు తీరారు. బయట వీఽధుల్లో ఒక్కో గుడ్డుకు రూ.6 వసూలు చేస్తుండటం, ఇక్కడ 4.50కే లభిస్తుండటంతో చాలా మంది ట్రేలు కొనుగోలు చేసి తీసుకెళ్లిపోయారు.  


Updated Date - 2021-05-06T05:35:28+05:30 IST