ముక్కంటి ఆలయంలో రద్దీ

ABN , First Publish Date - 2021-08-01T05:30:00+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనార్థం ఆదివారం పలుప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.

ముక్కంటి ఆలయంలో రద్దీ
స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులు

శ్రీకాళహస్తి అర్బన్‌, ఆగస్టు 1: శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనార్థం ఆదివారం పలుప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. సెలవు దినం కావడంతో తిరుమల వెళ్లిన భక్తులు వాయులింగేశ్వరుడి దర్శనార్థం శ్రీకాళహస్తి విచ్చేశారు. దీంతో ఎక్కడా ఇబ్బందులు రాకుండా ఆలయ ఈవో పెద్దిరాజు అన్ని చర్యలు తీసుకున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులను ముక్కంటి దర్శనానికి అనుమతించారు. 

Updated Date - 2021-08-01T05:30:00+05:30 IST