Abn logo
Aug 2 2020 @ 15:29PM

కరోనా కాలంలోనూ తగ్గని భక్తుల రద్దీ

విజయవాడ: కరోనా కాలంలోనూ భక్తుల రద్దీ తగ్గడంలేదు. ఇంద్రకీలాద్రిపై సమదూరం పాటిస్తూ.. భక్తులు మాస్కులు ధరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల పూజలు, మొక్కులు దుర్గమ్మ అందుకుంటోంది. భక్తులు టిక్కెట్లను అన్ లైన్, టైమ్ స్లాట్ పద్ధతిలో తీసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. కరోనా ప్రభావం కారణంగా ఆలయానికి కొంత రద్దీ తగ్గినప్పటికీ దుర్గమ్మ దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. కరోనా ప్రభావం చూపకుండా ఆలయంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లో ఆరడుగుల దూరం మేర వృత్తాకారం సర్కిల్, థర్మల్ స్క్రినింగ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement