కిటకిటలాడిన సాగర తీరం

ABN , First Publish Date - 2022-05-23T06:07:42+05:30 IST

ఆర్కే బీచ్‌ సందర్శకులతో కిటకిటలాడింది.

కిటకిటలాడిన సాగర తీరం

ఆర్కే బీచ్‌ సందర్శకులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం  వేలాది మంది నగరవాసులు బీచ్‌కు తరలివెళ్లారు. ఉదయం నుంచి ఎండ ఠారెత్తిస్తుండడంతో.. తీవ్రత తగ్గిన తరువాత బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించారు. చల్లని గాలుల మధ్య సేద తీరేందుకు తీరానికి చేరుకున్నారు. దీంతో నోవాటెల్‌ నుంచి వైఎంసీఏ ఎదురుగా ఉన్న చిల్డ్రన్‌ పార్కు వరకు రహదారి కిటకిటలాడింది. కొందరు బీచ్‌లో స్నానాలు చేస్తూ ఎంజాయ్‌ చేయగా, మరికొందరు గోడలపై కూర్చుని చల్లని గాలులను ఆస్వాదించారు. సందర్శకుల వాహన రాకపోకలతో బీచ్‌రోడ్డు కిక్కిరిసింది. - ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం 

Updated Date - 2022-05-23T06:07:42+05:30 IST