సుప్రీంకోర్టుకు వచ్చిన ట్రంప్‌కు షాక్

ABN , First Publish Date - 2020-09-25T09:07:03+05:30 IST

దివంగత సుప్రీంకోర్టు జస్టిస్‌ రూత్ బాడర్ గిన్స్‌బర్గ్‌(87)కు నివాళులర్పించేందుకు

సుప్రీంకోర్టుకు వచ్చిన ట్రంప్‌కు షాక్

వాషింగ్టన్: దివంగత సుప్రీంకోర్టు జస్టిస్‌ రూత్ బాడర్ గిన్స్‌బర్గ్‌(87)కు నివాళులర్పించేందుకు సుప్రీంకోర్టుకు వచ్చిన ట్రంప్‌కు పరాభవం ఎదురైంది. సుప్రీంకోర్టు వెలుపల మెట్లపై గిన్స్‌బర్గ్‌కు ట్రంప్ నివాళులర్పించారు. సరిగ్గా ఇదే సమయంలో అక్కడ గుమిగూడిన వారంతా ‘అతడిని ఓడించండి‘(ఓట్ హిమ్ అవుట్) అంటూ గట్టిగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. అనంతరం గిన్స్‌బర్గ్ చివరి కోరికను తీర్చమంటూ అరిచారు. దీంతో ట్రంప్‌కు ఏం చేయాలో తోచలేదు. 1993లో డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్షుడిగా గెలిచిన బిల్ క్లింటన్.. సుప్రీంకోర్టులో గిన్స్‌బర్గ్‌ను నియమించారు. 2016 ఎన్నికల సమయంలో గిన్స్‌బర్గ్ ట్రంప్‌పై పలు విమర్శలు కూడా చేశారు. ఇక తన స్థానాన్ని భర్తీ చేయించే బాధ్యతను కొత్తగా ఎన్నికయ్యే అధ్యక్షుడే తీసుకోవాలని గిన్స్‌బర్గ్ మరణించే కొద్ది రోజుల ముందు తన మనుమరాలితో చెప్పినట్టు వార్తలొచ్చాయి. దీంతో ట్రంప్‌ను ఓడించి గిన్స్‌బర్గ్ చివరి కోరికను తీర్చాలంటూ డెమొక్రట్లు ప్రజలను కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టు కొత్త జస్టిస్‌ను శనివారం ప్రకటించనున్నట్టు ట్రంప్ చెప్పారు.

Updated Date - 2020-09-25T09:07:03+05:30 IST