కరోనాపై దాగుడుమూతలు

ABN , First Publish Date - 2020-03-31T11:49:38+05:30 IST

కరోనా వాస్తవ ఫలితాలు వెళ్లడించడంలో జిల్లా వైద్యాధికారులు దాగుడు మూతలు ఆడుతున్నారనే అనుమానాలు

కరోనాపై దాగుడుమూతలు

వాస్తవ సమాచారం చెప్పని అధికారులు

అనుమానితులపై పాజిటివ్‌ అంటూ పుకార్లు

ఆందోళనలో ఆయా ప్రాంతాల ప్రజలు

నోరు మెదపని వైద్యులు

మీడియాకు దూరంగా వైద్యాధికారులు

కరోనా పాజిటివ్‌పై 

బలపడుతున్న అనుమానాలు


అనంతపురం వైద్యం, మార్చి 30 : కరోనా వాస్తవ ఫలితాలు వెళ్లడించడంలో జిల్లా వైద్యాధికారులు దాగుడు మూతలు ఆడుతున్నారనే అనుమానాలు కలుగుతున్నా యి. ప్రస్తుతం జిల్లాలో కరోనా అనుమానితుల్లో  పాజి టివ్‌ ఉందన్న ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా అనంతపురం, హిందూపురం, రాయదుర్గం, ఉరవకొండ, పుట్టపర్తి ప్రాంతాలు డేంజర్‌ జోన్‌గా జిల్లాలో మా రిపోయాయి. ఈ ప్రాంతాల నుంచే అనుమానిత కేసులు అధికంగా వస్తున్నాయి. అయితే ఎంత మందిని ఐసొలేషన్‌కు తరలించారు. ఎంత మందిని క్వారంటైన్‌కు తరలించారనే సమాచారం చెప్పడానికి కూడా అధికారులు ఇష్టపడటం లేదు.


ఆయా ఆస్ప త్రులలో పనిచేస్తూ కరోనా బాధితులకు చికిత్స అందిస్తు న్న వైద్యులు నోరు మెదపడం లేదు. కానీ కరోనా కేసులు వస్తుండటంతో ఆ వై ద్యులు, సిబ్బంది మాత్రం భయంతో అల్లాడిపోతున్నారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో  తమ ఆవేదనను చెబుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు సం బంధించిన పూర్తి బాధ్యతలు వహిస్తున్న డీఎంహెచ్‌ఓ, ఆస్పత్రి సూపరింటెండెంట్‌  మీడియాకు దూరంగా ఉండిపోతున్నారు. ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయడం లేదు. ఒకవేళ ఎదురుపడినప్పుడు ఏదైనా అడిగితే చిరునవ్వు నవ్వుతున్నారు. గుచ్చిగుచ్చి అడిగితే అబ్బే అలాంటిదేమీ లేదు. అంతా పుకార్లు అని తేలికగా కొట్టిపారేసి వెళ్లిపోతున్నారు. ఇక్కడే అనుమానాలకు బలం చేకూరుతోంది. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు లేన ప్పుడు సమాచారం ఇవ్వాల్సిన వైద్యాధికారులు మౌనంగా ఉంటూ ఎందుకు తప్పించుకుంటున్నారు.


చివరకు మీడియా ఫోన్‌లు కూడా ఎత్తకుండా  ఎందుకు ఉంటున్నారు.  ఇదే అనుమానాలకు దారి తీస్తోంది. ప్రధానంగా హిందూపురం ప్రాంతంలో కరోనా అధికార యంత్రాంగాన్ని నిద్రలేకుండా చేస్తోంది. అక్కడ ఇటీవల అజ్మీర్‌కు వెళ్లి వచ్చిన బృందంలో ఓ వృద్ధుడు కరోనాతో కర్ణాటకలో చని పోయాడు. ఆ బంధువులందరూ హిందూపురం ప్రాం తంలో ఉన్నారు. మూ డ్రోజులుగా ఆయా కుటుంబాలను క్వారంటైన్‌లో బంధిం చి శాంపిల్స్‌ పరీక్షలు చేయించారు. రిపోర్టులు నెగిటివ్‌ వచ్చాయని అయితే అధికారులు తెలి పారు. కానీ లేపాక్షిలో ఓ ఇంటిని అధికారులు పూర్తిగా దిగ్బంధించారు. ఆ ఇంటి పరిసర ప్రాంతాలకు ఎవర్నీ వెళ్లనీయకుండా చర్యలు చేపట్టారు.


ఇక్కడ ఉండేవారిలో కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలిందని, అందుకే ఇలాంటి చర్యలు చేపట్టారన్న ప్రచారం సాగుతోంది. దీంతో ప్రజల్లో మరింత ఆందోళన మొదలైంది. అనంతపురం, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాలలో కూడా అనుమా నిత కేసులకు కరోనా పాజిటివ్‌ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంత ప్రజలు ఆందోళన చెం దుతున్నా రు. ఇలాంటి ఆందోళనలు తొలగాలంటే అధికా రులు తగిన చర్యలు తీసుకోవాలి. ఫలానా రోజు ఫలానా ప్రాం తవాసులు ఇంత మంది కరోనా అనుమానితులు వ చ్చారు. వారికి పరీక్షలు చేశామని, దాని ఫలితమేదైనా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.


కానీ అధి కార యంత్రాంగం ఆ పని చేయడం లేదు. వైద్యశాఖ అధికారులు ఈ విషయంలో నోరు మెదపడం లేదు. ఏదైనా అడిగితే కలెక్టర్‌ అని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇదే అనంతలో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. అ లాంటప్పుడు కలెక్టర్‌ అయినా నిత్యం వస్తున్న అనుమా నిత కేసులు, వ్యాధి నిర్ధారణ నివేదికలు వివరాలు రోజూ ప్రాంతాల వారీగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. 


Updated Date - 2020-03-31T11:49:38+05:30 IST